Monday, June 30, 2025

‘అలలు లేని సముద్రం’ ట్రైలర్ విడుదల

- Advertisement -
- Advertisement -

వసంత్, భాగ్యలక్ష్మి, రమ్య హీరో హీరోయిన్లుగా దర్శకుడు టి.రాము రూపొందిస్తున్న మూవీ అలలు లేని సముద్రం. ఈ చిత్రాన్ని ప్రొడ్యూసర్ రాంరెడ్డి నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హైదరాబాద్ ఫిలింఛాంబర్‌లో అలలు లేని సముద్రం సినిమా ట్రైలర్‌ను గ్రాండ్‌గా లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో అతిథిగా వచ్చిన నిర్మాత బాలాజీ నాగలింగం మాట్లాడుతూ.. – ‘దర్శకుడు రాము (Director Ramu) నాకు బాగా పరిచయం. ఆయన ఈ సినిమా చేస్తున్నానని చెప్పినప్పుడు ఇండస్ట్రీలో చిన్న చిత్రాలకు పరిస్థితులు అంత బాగా లేవని చెప్పాను.

అయినా పట్టుదలగా ఆయన మూవీ రూపొందించారు. అలలు లేని సముద్రం మూవీ ట్రైలర్ బాగుంది. ఈ సినిమాకు నా వంతు సపోర్ట్ చేస్తా‘ అని తెలిపారు. దర్శకుడు టి.రాము మాట్లాడుతూ ‘మా మూవీ ట్రైలర్ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ప్రస్తుతం మా మూవీ చిత్రీకరణ దశలో ఉంది. అక్టోబర్, నవంబర్‌లో చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం. అలలులేని సముద్రం అనే టైటిల్‌కు జస్టిఫికేషన్ ఇచ్చేలా మూవీ ఉంటుంది. నా దర్శకత్వంలో మరికొన్ని మూవీస్ రాబోతున్నాయి‘అని అన్నారు. ఈ కార్యక్రమంలో వేణు మాధవ్, రామ శర్మ, రోజా రాణి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News