Monday, June 30, 2025

సర్ప్రైజ్ ఎదురుచూస్తోంది… పవన్‌ సినిమాపై నాగవంశీ పోస్ట్‌

- Advertisement -
- Advertisement -

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ తొలిసారి నటిస్తున్న పిరియాడిక్ యాక్షన్ సినిమా ‘హరి హర వీరమల్లు. ఈమూవీ ట్రైలర్ ను జూలై 3న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ ట్రైలర్ పై నిర్మాత నాగవంశీ ఆసక్తికర పోస్ట్‌ చేశారు. “మీరందరూ ఏమి ఆశిస్తున్నారో నాకు తెలియదు… కానీ జూలై 3న రండి, మీకు సర్ ప్రైజ్ ఉంది!. #HariHaraVeeraMallu ట్రైలర్ నిజంగా అద్భతంగా ఉంది. స్కేల్, మ్యడ్ నెస్, మీరు చూడని ఎనర్జీతో ఇది వస్తుంది. మీరు దానిని అనుభూతి చెందుతారు.. దాని గురించి మాట్లాడుతారు” అని నాగవంశీ ఎక్స్ లో పేర్కొన్నాడు.

కాగా, ఇప్పటికే పలుసార్లు ఈ మూవీ విడుదల వాయిదా పడింది. ఈ క్రమంలో అన్ని కార్యక్రమాలను పూర్తి చేసిన మేకర్స్ ఇటీవల కొత్త రిలీజ్ తేదీని ప్రకటించారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ఇందులో పవన్ పోరాట యోధుడిగా నటిస్తున్నాడు. ఆయనకు జోడీగా ఇందులో హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ కనిపించనుంది. ఎం ఎం కీరవాణీ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతున్న ఈ సినిమాలో పలువరు అగ్ర నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News