Friday, August 15, 2025

పాశమైలారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడుపై సిఎం రేవంత్ దిగ్భ్రాంతి

- Advertisement -
- Advertisement -

పటాన్‌చెరు సమీపంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో సోమవారం ఉదయం జరిగిన భారీ పేలుడుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంటల ధాటికి పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడంపై సిఎం విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన తెలిపారు. ఈ ఘటనలో పలువురు మరణించడం కలచివేసిందన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు

అందించాలని ఆదేశాలు జారీ చేసినట్టుగా ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వంగా తాము బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం తగిన విధంగా ఆదుకుంటుందని, గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందించేందుకు అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటామని సిఎం తెలిపారు. పాశమైలారం ఘటనపై అధికారులు సంపూర్ణ నివేదిక సమర్పించాలని సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News