Tuesday, July 1, 2025

సంగీతమే ప్రధానంగా ప్రేమకథ

- Advertisement -
- Advertisement -

వరలక్ష్మీ పప్పుల సమర్పణలో కనకదుర్గారావు పప్పుల నిర్మాతగా భాను దర్శకత్వంలో సరికొత్త ప్రేమకథతో రాబోతున్న సినిమా ప్రేమిస్తున్నా. సాత్విక్ వర్మ, ప్రీతి నేహా హీరో హీరోయిన్లు గా నటించారు. సంగీతమే ప్రధానంగా సాగే ఈ ప్రేమకథలో వచ్చే సన్నివేశాలు చాలా ఆసక్తికరం గా, నెక్స్ ఏం జరుగుతుందో అనే సస్పెన్స్‌తో దర్శకుడు భాను ఈ సినిమాను రూపొందించారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ చిత్ర ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకులు భీమ్స్, దర్శకులు అశోక్.జి, అనుదీప్ కె.వి, భాను బోగవరుపు, కాసర్ల శ్యామ్, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐబిఎమ్ మెగా మ్యూజిక్ (IBM Mega Music) ఆడియో కంపెనీ ను లాంచ్ చేయడం విశేషం.

ఈ సందర్భంగా నిర్మాత కనకదుర్గారావు పప్పుల మాట్లాడుతూ “అన్ని ప్రేమకథ (love story)ల్లోనూ ప్రేమ ఉంటుంది, కానీ ఈ ప్రేమకథలో ఆకాశమంత ప్రేమ అనంతమైన ప్రేమ ఉంటుంది. ప్రేలో ఇదివరకు ఎవ్వరూ టచ్ చెయ్యని ఒక డిఫరెంట్ పాయింట్ తో ప్రేమిస్తున్నా సినిమాను తెరకెక్కించారు దర్శకుడు భా ను”అని అన్నారు. దర్శకుడు భాను మాట్లాడుతూ “ఎన్నో చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన సాత్విక్ వర్మ ప్రేమిస్తున్నా సినిమాతో హీరోగా లాంచ్ అవుతున్నారు. అలాగే తెలుగమ్మాయి ప్రీతి నేహా హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఇద్దరూ పోటీపడి బాగా నటించారు”అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News