Wednesday, July 2, 2025

కార్యకర్త గర్వపడేలా బిజెపిని తీర్చిదిద్దుతా: మాధవ్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో బిజెపిని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుతానని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన పి.వి.ఎన్ మాధవ్ (P.V.N. Madhav) తెలిపారు. పదవి అనేది గొప్పస్థానం కాదని, అదొక బాధ్యత అని అన్నారు. ఈ సందర్భంగా విజయవాడ బిజెపి రాష్ట్ర కార్యాలయం (BJP State Office) లో ఆయన మాట్లాడుతూ.. కార్యకర్త గర్వపడేలా బిజెపిని తీర్చిదిద్దుతానని తెలియజేశారు. తన చిన్న వయసులో దేశంలో ఎమర్జెన్సీ విధించారని, ఎమర్జెన్సీ సమయంలో తన తల్లితో పాటు తాను జైలుకెళ్లాను అని ఆవేదనను వ్యక్తం చేశారు. అందరితో కలిసి బిజెపిని బలంగా మారుస్తాం అని మాధవ్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News