- Advertisement -
మంగళగిరి: ఒకప్పుడు సినిమాలో ‘పాకీజా’ పాత్రలో నటిస్తూ.. ప్రేక్షకుల చేత నవ్వులు పూయించారు నటి వాసుకీ (Actor Vasuki). ప్రస్తుతం ఆమె దీనస్థితిలో ఉన్నారు. పూటగడవటానికి కూడా కష్టంగా ఉందంటూ ఆమె కొద్ది రోజుల క్రితం ఓ వీడియోని విడుదల చేశారు. ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్‌కళ్యాణ్‌లను తనకు సాయం చేయాలని వేడుకున్నారు. పాకీజా దీనస్థితిపై డిప్యూటీ సిఎం పవన్‌కళ్యాణ్ స్పందించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి పిలిపించి ఆమెకు రూ.2 లక్షల తక్షణ ఆర్థిక సాయం అందజేశారు. ఈ మొత్తాన్ని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పి.హరి ప్రసాద్, పి.గన్నవరం శాసనసభ్యులు గడ్డి సత్య నారాయణ వాసుకికీ అందించారు. తనకు సాయం చేసిన పవన్‌కళ్యాణ్‌కు వాసుకీ కృతజ్ఞతలు చెప్పారు.
- Advertisement -