Wednesday, July 2, 2025

రామ్ చరణ్ పై శిరీష్‌ కామెంట్స్ వైరల్.. వివరణ ఇచ్చిన దిల్‌రాజు

- Advertisement -
- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై ప్రడ్యూసర్ శిరీష్ చేసిన కామెంట్స్ పై మెగా అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. నిన్న ఓ మీడియాలో ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ‘గేమ్‌ ఛేంజర్‌’ ప్లాప్ అవడంపై హాట్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా గురించి యాంకర్ అడగగా.. శిరీష్ సమాధానం ఇస్తూ.. సినిమా ప్లాప్ అయిన తర్వాత కనీసం ఎలా ఉన్నారని కూడా డైరెక్టర్ శంకర్, హీరో రామ్ చరణ్ లు ఫోన్ కూడా చేయలేదని.. సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ కాకపోతే మేం రోడ్డున పడేవాళ్లమని అన్నారు. ఈ కామెంట్స్ చేసిన నిర్మాత శిరీష్ పై మెగా అభిమానులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు, ఆ మూవీకి ప్రమోషన్స్ చేయలేదని, షూటింగ్ కంప్లీట్ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. చిత్రీకరణ సమయంలోనే సాంగ్ లీక్, రిలీజ్ అయిన మరోసటి రోజే మూవీ హెచ్ డీ పైరసీ కావడం.. అంతా నిర్మాతల వల్లే జరిగిందని.. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ మూడేళ్ల ప్రైమ్ టైమ్ ను వేస్ట్ చేశారని.. పైగా ఆయనపై నిందలు వేస్తారా? అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

ఈ నేపథ్యంలో శిరీష్ వ్యాఖ్యలపై దిల్ రాజు వివరణ ఇచ్చారు. శిరీష్ తొలిసారి మీడియకు ఇంటర్వ్యూ ఇచ్చారని.. కాస్త ఎమోషనల్‌ అవ్వడంతోనే అలా మాట్లాడారని అన్నారు. డిస్ట్రిబ్యూటర్‌ పాయింట్‌ ఆఫ్‌లో శిరీష్ మాట్లాడారంతేనని.. అతని వ్యాఖ్యల వెనుక వేరే ఏ ఉద్దేశమూ లేదని దిల్ రాజు డ్యామేజ్ ను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News