- Advertisement -
జింబాబ్వేతో జరిగిన తొలి టెస్టులో సౌతాఫ్రికా 328 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో దక్షిణాఫ్రికా సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని దక్కించుకుంది. క్లిష్టమైన లక్షంతో రెండో ఇన్నింగ్స్ చేపట్టిన ఆతిథ్య జింబాబ్వే టీమ్ 208 పరుగులకే కుప్పకూలింది. మసకద్జా (57), కెప్టెన్ ఇర్విన్ (49), ముజరబ్బాని 32 (నాటౌట్) మాత్రమే కాస్త రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో కార్బిన్ బొస్చ్ ఐదు, కొడి యూసుఫ్ మూడు వికెట్లు పడగొట్టారు. ఇక దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 418, రెండో ఇన్నింగ్స్‌లో 369 పరుగులు చేసింది. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 251 పరుగులకే ఆలౌటైంది.
- Advertisement -