Monday, August 18, 2025

ఎఫ్‌ఎల్‌ఎన్ ఏఎక్స్‌ఎల్(ఏఐ) ల్యాబ్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/రఘునాథపల్లి: మండలంలోని మండెలగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఎఫ్‌ఎల్‌ఎన్ ఏఎక్స్‌ఎల్ ల్యాబ్(ఏఐ) ల్యాబ్‌ను ఎంఈఓ పి. రఘునందన్‌రెడ్డి ప్రారంభించారు. ఇందులో 3, 4, 5 తరతగుల్లో వెనుకబడిన విద్యార్థులకు భాష, గణితంలో కనీస అభ్యసన స్థాయి మెరుపర్చడం జరుగుతుందన్నారు. వీరికి బోధనాభ్యాస ప్రక్రియలో మరింత చురుకుగా పాల్గొనడానికి ఈ కార్యక్రమం దోహపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు డాక్టర్ భారత రవీందర్, ప్రాథమిక పాఠశల ప్రధానోపాధ్యాయుడు ఉపేంద్రం, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం, స్థానిక ఉన్నత పాఠశల ప్రధానోపాధ్యాయుడు రాజ్‌పాల్‌రెడ్డి, సీనియర్ ఉపాధ్యాయులు రామ్మోహన్, అనిల్‌కుమార్, ఏఏపీసీ ఛైర్మన్ చుక్కా భారతమ్మ, సీఏ ఉపేంద్ర, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందం శిరీష, కల్పన, అనూష, మారుతి రాజు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News