Thursday, July 3, 2025

36కు చేరిన మృతుల సంఖ్య

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సంగారెడ్డి బ్యూరో : పాశమైలారంలో రియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఒక అంచనా ప్రకారం మృతుల సంఖ్య 50 ఉండొచ్చని అంటున్నారు. మంగళవారం సాయంత్రం వరకు అధికారికంగా ప్రకటించిన మృతుల సంఖ్య 39గా ఉంది. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగి దేశ చరిత్రలోనే అత్యంత విషాదకర ఘటనల్లో ఇది కూడా ఒకటిగా నిలిచే అవకాశముంది. ప్రమాదం జరిగిన సమయంలో 143 మంది కార్మికులు కంపెనీలో ఉన్నారు. ఇప్పటి వరకు 39 మంది చనిపోయినట్టుగా తెలియగా, ప్రమాదం నుంచి 58 మంది బయటపడ్డారు. 11 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. ఆసుపత్రుల్లో 35 మంది చికిత్స పొందుతున్నారు.

బాధిత కుటుంబాలకు తక్షణ సాయం
సోమవారం ఉదయం ప్రమాదం జరిగిన దగ్గర నుంచి నిరంతరాయంగా శిథిలాలను తొలగిస్తున్నారు. సాయం త్రం వర్షంలోనూ భారీ క్రేన్లు, జెసిబిలు పనిచేశాయి. నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. మట్టిదిబ్బలుగా ఆ ప్రాంతం కనపడుతోంది. అటు కంపెనీ వద్ద, ఇటు ఆస్పత్రుల వద్ద బాధిత కుటుంబ సభ్యులు తమ వారి కోసం తిరుగుతున్నారు. ఎవరిని కదిలించినా.. కట్టలు తె గిన కన్నీటి సంద్రమే…! ఇదిలా ఉంటే పటాన్‌చెరు ప్రభుత్వాసుపత్రి మార్చురీ వద్ద గుట్టలుగా మృతదేహాలున్నా యి. ఏ మృతదేహం ఎవరిదో తెలియక కార్మికుల కుటుంబాలు ఎదురుచూపులు చూస్తున్నాయి.

డిఎన్‌ఎ రిపోర్టు వచ్చిన తర్వాత బంధువులకు ఆయా మృతదేహాలను అధికారులు అప్పగిస్తున్నారు. పటాన్ చెరు ధృవ ఆస్పత్రి వద్ద మంత్రి రాజనర్సింహ మాట్లాడారు. ఇక్కడ చికిత్స పొందుతున్న 9 మందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉం దని అన్నారు. హైదరాబాద్‌లోని ప్రణాం, అర్చన, పనేషియా ఆస్పత్రుల్లోనూ మరికొందరు క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారని తెలిపారు. రాత్రి వరకు రెస్కూ ఆపరే షన్ కొనసాగుతుందని అన్నారు. తమకు అందిన అధికారిక లెక్కల ప్రకారం ఇంకా 9 మంది ఆచూకీ లభించలేదని, బాధిత కుటుంబాలకు భోజనం, వసతి సౌకర్యాల ను కల్పించామని తెలిపారు. ఇదిలా ఉంటే, మృతుల, బా ధిత కుటుంబాలకు తక్షణ సాయాన్ని అందజేస్తున్నారు. పోస్టుమార్టం పూర్తయిన 11 కుటుంబాలకు రూ.లక్షచొప్పున ఆర్థిక సాయాన్ని కలెక్టర్ ప్రావీణ్య అందజేశారు.

సుమోటోగా తీసుకున్నహెచ్‌ఆర్‌సి
పాశమైలారం ఘటనను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సమోటోగా తీసుకుంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలతో ఈ నెల 30వ తేదీలోగా నివేదిక సమర్పించాలని, సంగారెడ్డి జిల్లా కలెక్టర్, లేబర్ కమిషనర్, ఫైర్ డిజి, సంగారెడ్డి ఎస్పీకి ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా, ఈ ఘటనపై న్యాయవాది కుమారస్వామి హెచ్‌ఆర్‌సికి ఫిర్యాదు చేశారు. పాత యంత్రాలు వాడకం, అధికారులు తనిఖి నిర్లక్షం వల్లే ప్రమాదం సంభవించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిర్లక్షంగా వ్యవహరించిన అధికారులు, సిగాచి కెమికెల్ పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

ఎన్‌హెచ్‌ర్‌సికి ఫిర్యాదు
పాశమైలారం ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు న్యాయవాది ఇమ్మనేని రామారావు ఫిర్యాదు చేశారు. సిగాచి పరిశ్రమ డైరెక్టర్ల నిర్లక్షం వల్లే ప్రమాదం జరిగిందని, మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షలు, గాయపడ్డ వారికి రూ. 10 లక్షల నష్ట పరిహారం ఇప్పించాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పాటుగా రాష్ట్రంలోని అన్ని పరిశ్రమల్లో భద్రతా పరమైన తనిఖీలు నిర్వహించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News