Monday, August 18, 2025

కేంద్ర ప్రభుత్వ పథకాలకు రైతు రిజిస్ట్రీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/యాచారంః రైతులు కేంద్ర ప్రభుత్వ ఆధారిత పథకాలను పొందాలంటే పార్మర్ ఐడీ రిజిస్టేషన్ తప్పని సరి చేయించుకోవాలని మండల వ్యవసాయాధికారి రవినాథ్ సూచించారు. మంగళవారం యాచారం రైతు వేదికలో ఆయన మాట్లాడుతూ.. రైతు ఐడి రిజిస్టేషన్‌కు రైతులు తమ పట్టాదారు పాసు పుస్తకాలు, ఆధార్ కార్డు దానికి లింకుఉన్న ఫోన్‌తో వచ్చి సంబందిత క్లస్టర్ వ్యవసాయ విస్తరణాధికారి వద్ద రైతులు తమ పేర్ల వివరాలను నమోదు చేయించుకోవాలని తెలియజేశారు.అలాగే ఈ సీజన్‌లో తమ పొలంలో ఏ పంట వేశారో కూడా తెలియపరుస్తూ ఈ నెల 8 తేదీలోగా రైతులు తమ వివరాలు నమోదు చేయించుకోవాలని ఆయన సూచించారు.కార్యక్రమంలో క్లస్టర్ ఎఈఓలు,రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News