Thursday, July 3, 2025

భారత్ కు సవాల్

- Advertisement -
- Advertisement -

ఆత్మవిశ్వాసంతో ఇంగ్లండ్, నేటి నుంచి రెండో టెస్టు

బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగే రెండో టెస్టు మ్యాచ్ టీమిం డియాకు సవాల్‌గా మారింది. తొలి టెస్టులో ఓటమి పాలైన భారత్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఇక ఇంగ్లండ్ లీడ్స్ మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించి జోరు మీదుంది. ఈ మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. రెండో టెస్టులోనూ గెలిచి భారత్‌పై మరింత ఒత్తిడి తేవాలని భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆతిథ్య టీమ్ సమతూకంగా కనిపిస్తోంది. ఓపెనర్లు జాక్ క్రాలీ, బెన్ డకెట్‌లు ఫామ్‌లో ఉన్నారు. తొలి టెస్టు విజయంలో డకెట్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. క్రాలీ కూడా సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. ఓలి పోప్ కూడా తొలి టెస్టులో సెంచరీతో అదరగొట్టాడు. ఈసారి కూడా మెరుపులు మెరిపించాలనే లక్షంతో ఉన్నాడు. జో రూట్, కెప్టెన్ బెన్ స్టోక్స్, వికెట్ కీపర్ జేమీ స్మిత్ తదితరులతో ఇంగ్లండ్ బ్యాటింగ్ చాలా పటిష్టంగా ఉంది. బౌలింగ్‌లోనూ ఇంగ్గీష్ టీమ్ పటిష్టంగానే కనిపిస్తోంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

తీవ్ర ఒత్తిడిలో..

ఇక టీమిండియాపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. తొలి మ్యాచ్‌లో గెలిచే స్థితిలో ఉండి కూడా ఓటమి పాలు కావడంతో జట్టు ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నది. ఇలాంటి స్థితి లో ఇంగ్లండ్‌ను ఓడించడం అనుకున్నంత తేలికకాదనే చెప్పాలి. ఓపెనర్లు కెఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్‌లు శుభారంభం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీరిద్దరూ తొలి టెస్టులో సెంచరీలో రాణించిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఇక కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జట్టుకు కీ లకంగా మారాడు. జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత అతనిపై నెల కొంది.

వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ కూడా మరోసారి మెరుపులు మెరిపించక తప్పదు. తొలి టెస్టులో రిషబ్ రెండు ఇన్నింగ్స్‌లలో కూడా సెంచరీలతో ఆకట్టుకున్నాడు. ఈసారి కూడా జట్టుకు కీలకంగా మారాడు. మరోవైపు తొలి టెస్టులో విఫలమైన కరుణ్ నాయర్, సాయి సుదర్శన్‌లు సత్తా చాటాల్సిన అవసరం ఉంది. సీనియర్ బౌలర్ జస్‌ప్రిత్ బుమ్రా ఈ మ్యాచ్‌లో ఆడతాడా లేదా అనే దానిపై స్పష్టత లేదు. ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న బుమ్రా ఈ మ్యాచ్‌లో ఆడడం సందేహంగానే ఉంది. ఇదే జరిగితే టీమిండియా బౌలింగ్ మరింత బలహీనంగా మారే ప్రమా దం ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో గెలవాలంటే భారత్ సమష్టిగా రాణించక తప్పదు.
జట్ల వివరాలు:

భారత్ (అంచనా): యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, సాయి సుదర్శన్, శార్దూల్ ఠాకూర్ /వాషింగ్టన్ సుందర్, బుమ్రా/ఆకాశ్‌దీప్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ/అర్ష్‌దీప్ సింగ్.

ఇంగ్లండ్ ప్లెయింగ్ ఎలెవన్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలి పోప్, జో రూట్, హ్యారి బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News