పాన్ ఇండియా నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్… క్లీమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి ప్రతి ష్టాత్మకమైన, సెన్సేషనల్ వెంచర్ – మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ (ఎంసియు) కోసం చేతు లు కలిపింది. ఈ విజనరీ యానిమేటెడ్ ఫ్రాంచైజీ విష్ణువు దశ అవతారాల పురాణ గాథకు జీవం పో స్తుంది. ఇది అత్యాధునిక యానిమేషన్, భారతీయ పురాణాల బేస్డ్ కంటెంట్‌లో ఇంతకు ముందు ఎ న్నడూ ప్రయత్నించని సినిమాటిక్ స్కేల్‌తో అల రించబోతోంది.
దర్శకుడు అశ్విన్ కుమార్ దర్శ కత్వంలో శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్ నిర్మిస్తున్న మహావతార్ నరసింహ, మొదటి భాగం జూలై 25, 2025న ఐదు ప్రధాన భారతీయ భాషలలో అత్యాధునిక 3డి ఫార్మాట్‌లో విడుదల కానుంది. తాజాగా విడుదలైన ప్రోమో ప్రపంచాన్ని గందరగోళంలోకి నెట్టే ప్రమాదం ఉన్న హిరణ్యకశిపుడిని పరిచయం చేస్తుంది. కళ్లు చెదిరే విజువల్స్, అద్భుతమైన సంగీతం, కాలాన్ని ప్రతిధ్వనించే పౌరాణిక వైభవంతో ఈ ప్రోమో అధర్మం రాజ్యమేలుతున్న యుగం యొక్క తీవ్రతను చూపిస్తోంది.