- Advertisement -
తాడ్వాయి : మేడారంలో 2026లో నిర్వహించే శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతర తేదీలను పూజారులు ఖరారు చేశారు. జాతర తేదీలను పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ప్రకటించారు. బుధవారం మేడారంలోని ఎండోన్‌మెంట్ కార్యాలయంలో పూజారులు, పుర ప్రజలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు మాట్లాడారు.
2026 జనవరి 28వ తేదీన బుధవారం సాయంత్రం కన్నెపల్లి నుండి సారలమ్మ, పూనుగొండ్ల నుండి పగిడిద్దరాజు, కొండాయి నుండి గోవిందరాజులను గద్దెలపైకి తీసుకొస్తారని, జనవరి 29వ సాయంత్రం చిలుకలగుట్ట నుండి సమ్మక్క తల్లిని గద్దె మీదకు తీసుకొస్తారని తెలిపారు. అదేవిధంగా జనవరి 30వ తేదీన వన దేవతలకు మొక్కులు చెల్లింపులు, జనవరి 31వ తేదీన తల్లుల వన ప్రవేశం ఉంటుందని ప్రకటించారు. అనివార్య కారణాల రీత్యా 2024 జాతర తేదీలను 9 నెలల ముందుగానే ప్రకటించారు.
- Advertisement -