Thursday, July 3, 2025

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో బాలిక అదృశ్యం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో బాలిక అదృశ్యమైన సంఘటన కలకలం సృష్టిస్తోంది. ఓ బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి బిహార్‌కు వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చింది. వాటర్ బాటిల్ కొనుగోలు చేసేందుకు బయటకు వెళ్లింది. బయటకు వెళ్లిన బాలిక రాకపోవడంతో తల్లిదండ్రులు స్టేషన్‌లో వెతికారు. ఎక్కడా కనిపించక పోవడంతో గోపాలపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిసి కెమెరాలను పరిశీలించగా ప్లాట్‌పామ్ ఐదు నుంచి అల్ఫా హోటల్ వైపు బాలిక వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News