Thursday, July 3, 2025

మా సినిమా విషయంలో కూడా.. మంచు విష్ణు విధానమే కరెక్ట్: దిల్ రాజు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నితిన్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై వస్తున్న చిత్రం ‘తమ్ముడు’. జూలై 4వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌లు, టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాను చూస్తేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధిచి ఓ అంశాన్ని మంచు విష్ణు తన చిత్రం కన్నప్ప కోసం చేసిన పని నుంచి ఆదర్శంగా తీసుకంటామని నిర్మాత దిల్ రాజు (Dil Raju) తెలిపారు.

మంచు విష్ణు తాజా చిత్రం ‘కన్నప్ప’. జూన్ 27వ తేదీన ఈ సినిమా విడుదలైంది. అయితే షినిమా విడుదలకు ముందు చిత్ర యూనిట్ ఫేక్ రివ్యూలు ఇచ్చే వారికి, నెగెటివ్ టాక్ వ్యాప్తి చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టీం హెచ్చరించింది. దీంతో సినిమాపై నెగెటివ్ టాక్ కానీ, ఫేక్ రివ్యూలు కానీ రాలేదు. దీంతో ఇప్పుడు తమ్ముడు సినిమాకు కూడా ఇదే స్ట్రాటజీని అమలు చేయాలని చూస్తున్నారు. ఈ విషయాన్ని దిల్ రాజు (Dil Raju) స్వయంగా వెల్లడించారు. రివ్యూలు రాయడం తప్పు కాదని.. కానీ, నెగెటివ్‌గా రాస్తే నష్టపోయేది నిర్మాతేలే అని ఆవేదన వ్యక్తం చేశారు. జెన్యూన్‌గా రివ్యూలు రాయమని ఆయన కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News