Thursday, July 3, 2025

అరుదైన ఫీట్ సాధించిన స్మృతి మంధాన.. రోహిత్ తర్వాత ఆమెనే..

- Advertisement -
- Advertisement -

భారత మహిళ క్రికెట్ జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో ఐదు టి-20లు, మూడు వన్డేల్లో తలపడనుంది. ఈ క్రమంలో తొలుత టి-20 సిరీస్ ప్రారంభమైంది. ఈ టి-20 సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో స్మృతి మంధాన (Smriti Mandanna) అరుదైన రికార్డును సాధించింది. భారత్ తరఫున 150 టి-20 మ్యాచులు ఆడిన క్రీడాకారిణిగా నిలిచింది. ఇప్పటివరకూ భారత మహిళ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 179 మ్యాచులు, పురుషుల వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ 159 మ్యాచులు ఆడారు. వీరిద్దరి తర్వాత స్మృతి (Smriti Mandanna) ఈ ఫీట్‌ను సాధించింది.

ఇక టి-20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత్ 97 పరుగుల భారీ తేడాతో విజయం సాదించింది. రెండో టి-20లోనూ భారత్‌నే విజయం వరించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జెమిమా రోడ్రిగ్స్ (63), అమన్‌జోత్ కౌర్ (63) అర్థశతకాలతో రాణించడంతో 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. ఆ తర్వాత ఇంగ్లండ్ టామీ బ్యూమాంట్ (54) హాఫ్ సెంచరీ చేసినా.. లక్ష్యాన్ని చేరుకోలేకపోయింద. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 157 పరుగులు మాత్రమే చేయడంతో భారత్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ మంచి ప్రదర్శన చేసిన అమన్‌జోత్ కౌర్‌కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News