బర్మింగ్‌హామ్: ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత్ (Team India) నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో కెఎల్ రాహుల్, యశస్వీ జైస్వాల్‌లు నెమ్మెదిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. అయితే 26 బంతులు ఎదురుకొని 2 పరుగులు చేసిన రాహుల్.. వోక్స్ బౌలింగ్‌లో క్లీస్ బౌల్డ్ అయ్యాడు. ఈ నేపథ్యంలో బ్యాటింగ్‌కు వచ్చిన కరుణ్ నాయర్.. జైస్వాల్‌తో కలిసి వికెట్ కాపాడుకుంటూ.. పరుగులు రాబట్టాడు. 22వ ఓవర్‌లో హ్యాట్రిక్ బౌండరీలు సాధించి జైస్వాల్ అర్థశతకం సాధించాడు. అయితే 24వ ఓవర్ మూడో బంతికి కరుణ్ నాయర్ (31) బ్రూక్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 25 ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. క్రీజ్‌లో జైస్వాల్(62), గిల్(1) ఉన్నారు.
జైస్వాల్ అర్థ శతకం.. లంచ్ సమయానికి భారత్ స్కోర్ ఎంతంటే..
- Advertisement -
- Advertisement -
- Advertisement -