Thursday, July 3, 2025

ఇన్ఫోసిస్ లో కామాంధుడు.. వాష్‌రూమ్‌లో సీక్రెట్ గా..

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఇన్ఫోసిస్ ఆఫీసులో ఓ కామాంధుడు.. సీక్రెట్ గా మహిళా ఉద్యోగుల వీడియోలను రికార్డు చేస్తూ దొరికిపోయాడు. నగరంలోని ఇన్ఫోసిస్ హెలిక్స్ విభాగంలో సీనియర్ అసోసియేట్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న ఉద్యోగి స్వాప్నిల్ నాగేష్ మాలి, కంపెనీ క్యాంపస్‌లోని మహిళల వాష్‌రూమ్ లోపల ఒక మహిళా సహోద్యోగిని చిత్రీకరించారనే ఆరోపణలతో అరెస్టు అయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇన్ఫోసిస్‌లో టెక్నికల్ టెస్టింగ్ లీడ్‌గా పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి.. జూన్ 30 (సోమవారం) ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆఫీసు IQE విభాగం మూడవ అంతస్తులోని మహిళల రెస్ట్‌రూమ్‌లో ఉన్నప్పుడు రహస్యంగా వీడియో తీసేందుకు ప్రయత్నించాడు. ఈ సంఘటన జరిగింది.

బాధితురాలు వాష్‌రూమ్‌లో ఉన్నప్పుడు.. ప్రక్కనే ఉన్న గది స్టాల్‌లో ఆమె ఏదో అనుమానాస్పద ప్రతిబింబం, కదలికను గమనించింది. దీంతో టాయిలెట్ సీటుపై లేచి నిల్చుని చూడగా.. పక్క స్టాల్‌లోని టాయిలెట్‌పై నిలబడి, మొబైల్ ఫోన్ పట్టుకుని ఆమెను రికార్డ్ చేస్తున్న వ్యక్తిని చూసి షాక్ అయ్యింది. వెంటనే కేకలు వేస్తూ వాష్‌రూమ్ నుండి బయటకు వచ్చి సహోద్యోగులకు సమాచారం ఇచ్చింది. ఆఫీస్ సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని స్వాప్నిల్‌ను పట్టుకున్నారు. అతని మొబైల్ ఫోన్‌ను తనిఖీ చేయగా.. బాధితురాలి వీడియో ఫుటేజ్‌ను గుర్తించారు. HR సూచనల మేరకు స్వాప్నిల్ క్షమాపణలు చెప్పి వీడియోను తొలగించాడు. తర్వాత ఈ ఘటనపై తన భర్తతో కలిసి బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అతడిని వదిలేస్తే.. మళ్లీ ఇలాంటి చర్యలు పునరావృతం కావచ్చని, ఆఫీస్ లోని ఇతర మహిళలకు హాని కలిగించవచ్చని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది. దీంతో  స్వాప్నిల్‌ను అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News