Thursday, July 3, 2025

నేను మూర్ఖుడిని కాను.. క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్ శిరీష్

- Advertisement -
- Advertisement -

గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్‌ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దిల్ రాజు సోదరుడు ప్రొడ్యూసర్ శిరీష్ (Producer Sirish) చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ‘గేమ్‌ ఛేంజర్’ సినిమా గురించి మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు చరణ్ అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురి చేశాయి. దీంతో ఆయన విపరీతంగా ట్రోలింగ్‌ను ఎదురుకున్నారు. తాజాగా ఈ వివాదంపై ఆయన స్పందించారు. గేమ్ ఛేంజర్ కోసం రామ్ చరణ్ తమకు పూర్తిగా సహకరించారని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశం విడుదల చేశారు.

అందులో నిర్మాత శిరీష్ మాట్లాడుతూ.. ‘‘మెగా అభిమానులకు నమస్కారం. మా ఎస్‌విసి సంస్థకి రామ్‌చరణ్, చిరంజీవికి మంచి అవినాభావ సంబంధం ఉంది. చరణ్‌కి నాకు మధ్యలో మంచి రిలేషన్‌షిప్ ఉంది. నేను అభిమానించే హీరోల్లో రామ్‌చరణ్ ఒకరు. ఆయనను అవమానించడం కానీ, కించపరచడం కానీ నా జన్మలో చేయను. నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన గురించి చిన్న మాట దొర్లిన అది నా తప్పే. అందుకు రామ్ చరణ్‌కి, ఆయన అభిమానులకు క్షమాపణ చెబుతున్నాను. అభిమానుల బాధను నేను అర్థం చేసుకోగలను. ఒక హీరోను అలా అంటే ఎవరు భరించలేరు. ఆయన్ను అవమానించలనే ఉద్ధేశ్యం కాదు. మెగా హీరోలు అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. అలాంటి అనుబంధం ఉన్న వాళ్లని అవమానించేంత మూర్ఖుడిని కాదు. సంక్రాంతికి ‘గేమ్‌ ఛేంజర్’ రిలీజ్‌తో పాటు.. ‘సంక్రాతికి వస్తున్నాం’ సినిమాను విడుదల చేయమని రామ్‌ చరణే చెప్పారు. లేకుంటే ఆ సినిమా రిలీజ్ అయ్యేది కాదు. దయచేసి మా మధ్య అభిప్రాయ విబేధాలు తీసుకురాకండి. నా ఫస్ట్ ఇంటర్వ్యూ కావడం వల్ల పొరపాటున మాట్లాడాను. అందుకు నన్ను క్షమించండి. త్వరలోనే రామ్‌చరణ్‌తో మరో సినిమా చేయబోతున్నాం. ధన్యవాదాలు’ అంటూ శిరీష్ (Producer Sirish) వీడియోలో వివరణ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News