Thursday, July 3, 2025

వలవేసి లాగి…వికృత కామకేళి!

- Advertisement -
- Advertisement -

దుబాయ్ : ప్రపంచ ప్రఖ్యాత, తలదన్నే ఆకాశహార్మాల జిలుగువెలుగుల రంగుల దుబాయ్ చీకటి లోగుట్టు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అత్యంత సంపన్నులు తమ వికృత లైంగిక చ ర్యలను పైకి విందువినోదాల ముసుగులో సాగించే రాక్షసకాండకు ముచ్చటగా పోర్టా పాటీ పార్టీలు అని పిలుస్తారు. ఈ విందుల క్రమంలో దుబాయ్ కుబేర కోటీశ్వర గణంలో కొం దరు ఏరికోరి అందమైన యువతులను ఈ సీక్రెట్ పార్టీలకు పిలుస్తారు. పసందైన విందుంటుంది. రండి బోలెడు ఊహించలేని విలాసాల కానుకలు ఉంటాయి. లగ్జరీ హోటల్స్‌లో బస ఉంటుంది. కాలు దించే పనిలేకుండా పడవల్లాంటి కార్లలో తి ప్పుతామని అమ్మాయిలకు వల విసురుతారు. ఇక ఒకసారి ఈ సాలెగూటిలో బందీ అయిన యువతులు గిలగిలాడాల్సిందే. స్థానిక సంపన్న దుష్టశక్తుల వికృత లైంగిక చేష్టలకుగురికావల్సిందే.

చివరికి ఇది ఓ లైంగిక తీవ్రవాద చర్య అయింది. దు బాయ్ పర్యటనకు , సందర్శనకు వచ్చే అందమైన యువతు లూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి రాకాసి పార్టీలకు ఎర కా రాదని , ఓ వైపుపలు రకాల శారీరక అత్యంత పరమ బూతు జుగుప్సాకర చేష్టలకు తనువులు గురి కావల్సి ఉంటుందని చట్ట వ్యవహారాల నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి పా ర్టీలు చట్ట వ్యతిరేకం అయినందున, వీటికి హాజరయ్యే యువతులు ఆనక ఇక్కడి అత్యంత కటుతరమైన చట్టపరమైన చిక్కు ల్లో పడాల్సి వస్తుందని తెలియచేస్తున్నారు. అటు చూస్తే లాస్‌వెగాస్ ఇటు చూస్తే దుబాయ్ ..ఈ రెండూ ప్రపంచ స్థాయిలో ప్రైవేటు పార్టీలు, డాన్స్‌లు రేవ్‌పార్టీలు , ఇంద్రభవనాలను తలదన్నే భవంతులు, ప్రముఖ ఇన్‌ఫ్లూయెన్సర్స్ , ఎటుచూసినా బౌన్సర్స్‌తో భూలోక స్వర్గంగా ఉంటాయి. ఇక దుబాయ్‌లో ఈ స్వర్గపు ద్వారాలు తెరుచుకుని వెళ్లితే ప్రత్యక్ష నరకాలు కూడా తొంగిచూస్తున్నాయి. ఇప్పుడు ఈ దశలో అత్యంత భయానక స్థితిని పరిచయం చేసే ఈ పార్టీలు ముందుకు వచ్చాయి. అత్యంత రహస్యంగా జరిగే ఈ విందులను పోర్టా పాటీ పార్టీలుగా వ్యవహరిస్తున్నారు. సంచలనాత్మకమైన ఈ కథనాన్ని ‘ఇండియా టూడే’ తన వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది.

ఉక్రెయిన్ మోడల్ విషాదాంతంతో ఈ వికృతం వెలుగులోకి
ఈ మధ్యకాలంలోనే ఉక్రెయిన్‌కు చెందిన అందాల యువతి , 20 సంవత్సరాల మోడల్ మేరియా కొవలచక్ తన యుద్ధ పీడిత దేశం వీడి ఇక్కడికి వచ్చి బలైంది. ఈ పార్టీల ఆకర్షణలో పడి వొళ్లంతా కామపు తూటాల బారిన పడి విషాదాంతం చెందింది. ఆమె గోడు ఈ దుబాయ్ జనారణ్యపు రోదనే అయింది. ఇక్కడికి వచ్చిన యువతిని కొందరు ఫాలో చేశారు. తరువాత ఈ పార్టీకి తరలించారు. పలు గిఫ్ట్‌లు, తరువాతి దశల్లో కానుకలు, ఇతరత్రా సౌకర్యాలు ఉంటాయని ఊరించి తీసుకువెళ్లారు. తనను ఓ రాత్రి ఉండేందుకు ఇద్దరు మగాళ్లు తీసుకువెళ్లారని వారు తమను తాము మోడల్ ఏజెంట్లమని చెప్పారని ఈ యువతి చివరిసారిగా తన తల్లికి తెలిపింది. తరువాతి దశలో ఆమె వెళ్లాల్సిన థాయ్‌లాండ్‌కు ఆ యువతి చేరలేకపోయింది. ఈ వికృత పార్టీలోనే ఆమె బతుకు అర్థాంతరంగా ముగిసింది.

పది రోజుల తరువాత ఆమె కుళ్లిన మృతదేహం దుబాయ్‌లోని ఓ చెత్తకుప్పలో పడి ఉండగా గుర్తించారు. వెన్నెముక విరిగింది. కాళ్లు చేతులు విరిగాయి. ఇక శరీర లోపలి భాగాలలో గాయాలు ఉన్నాయి. అయితే ఆమె నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్ పై నుంచి పడి మరణించిందని స్థానిక పోలీసులు చెప్పారు. అయితే ఆమె కుటుంబం, ఆమె తరఫు న్యాయవాదులు ఈ దిక్కులేని చావు వెనుక వేరే కారణం ఉందని పేర్కొంటున్నారు. ఈ దశలోనే ఈ పార్టీల దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. రష్యా లాయర్ కాట్యా గోర్డెన్ ఈ కేసుపై స్పందించారు. ఆమె ఈ పార్టీలో పాల్గొనేలా చేసేందుకు కొందరు బలవంతం చేశారని, ఈ క్రమంలోనే వికృత చర్యలకు గురై మరణించి , రోడ్డుపై శవం అయ్యి పడిందని ఈ లాయర్ తెలిపారు. చాలా సంవత్సరాలుగా ఇటువంటి పార్టీలు ,వీటి వెనుక చీకటి దందాలు జరుగుతూ వస్తున్నాయి. పలు ఉదంతాలు వెలుగులోకి రాలేదని స్పష్టం చేశారు. మేరియా విషాదాంతం తరువాత హక్కుల సంఘాలు, మహిళలు ఇప్పుడు వీటికి వ్యతిరేకంగా గళం విప్పారు. అయితే చట్టాల చట్రం ఇతరత్రా వేధింపులతో వీరి నిరసనల గొంతుకలను అణచివేశారని వెల్లడైంది. పెళ్లితో సంబంధం లేకుండా లైంగిక చర్యలకు దుబాయ్‌లో చట్టబద్ధమైన అనుమతి ఉంది. దీనిని ఆసరాగా చేసుకుని ఇప్పుడు అత్యంత ప్రమాదకర ప్రాణాంతక గేమ్‌లు సాగుతున్నాయని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.

మహిళలు తమకు తాము ఓ సంపన్నుల పార్టీకి ప్రత్యేక అతిధులుగా వెళ్లుతున్నామని అనుకుంటారు. అయితే లోపల వారు ఇక బయటకు రాలేని వికృత ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుతారు. పైగా పలు రకాల చట్టపరమైన సమస్యలు కూడా ఈ బాధితులే భరించాల్సి వస్తోందని దుబాయ్‌లోని డిటెన్యూల తరఫున పోరాడే సంస్థ సిఒఒ రాధా స్టిర్లింగ్ చెప్పారు. 2022 నుంచి కూడా ఇటువంటి పార్టీల వ్యవహారాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అప్పట్లో టిక్‌టాక్ యుజర్, ఎయిర్‌హోస్టెస్ లైమ్స్ ఇటువంటి చర్యలు నిజమేనని నిర్థారించారు. లైంగిక వికృతాల వీడియోలు కూడా తరువాత బిజినెస్‌గా మారాయి. పలు వీడియోల్లో దక్షిణాఫ్రికా ఇతర దేశాలకు చెందిన యువతులు ప్రత్యేకించి పేద దేశాలకు చెందిన గ్లామర్ యువతులు బలి అయిన వైనం వెలుగులోకి వచ్చింది. ఈ వలయంలోకి వెళ్లే వారు తమకు తాము విలాసాల లోకంలోకి వెళ్లుతున్నామని భావిస్తారు. బతుకు మలుపుతిప్పే విధంగా డబ్బులు అందుతాయని నమ్ముతారు. అయితే ఈ దశలో వారు చివరికి చేదు పీడకలల్లో కూరుకుపోతారు. బతుకులు నాశనం అవుతాయి.

కొరడా దెబ్బలు..వారిపైనే విసర్జనలు అత్యంత అమానుషాలు
మిషన్‌గన్స్‌తో అక్కడ చిత్రహింసలుఈ పార్టీల్లో చేరాల్సి వచ్చే యువతులు సంపన్న విటుల కొరడా దెబ్బలకు గురి అవుతారు. వారు రోదిస్తూ ఉంటే వీరు ఆనందిస్తారు. వారి ఒళ్లుతో ఆటటాడుకుంటూ చివరికి అన్ని రకాలుగా వారిపై ఈ వికృత వ్యక్తులు విసర్జనలకు కూడా దిగుతారు. పైశాచిక ఆనందం అనుభవిస్తారు.ఈ క్రమంలో బతికే వారు బతుకుతారు లేదంటే కొందరు శవాలు అవుతారు. అని సామాజిక సంచలన వేదిక రెడిట్ యుజర్ నోవెర్ వోల్ఫ్ తెలిపారు. స్పెయిన్‌కు చెందిన ఓ బాధిత యువతి తనతో ఈ భయంకర అనుభవం పంచుకుందని వోల్ఫ్ వెల్లడించారు. డైలీ మిర్రర్ ఇతరత్రా పత్రికా మీడియా సామాజిక మాధ్యమాలలో ఈ పాపపు చీకటి కోణాలువెలుగులకి వచ్చాయి.

ఇక అన్నింటికి మించి అత్యంత క్రూరమైన విధంగా యువతులను హింసిస్తారు. ఇదిజుగుప్సాకర చేష్టల్లో అత్యంత పరాకాష్ట అని ఓ మహిళ చిత్రహింసల ఆధారంగా డైలీ మిర్రర్ వెల్లడించింది. ‘. పార్టీలకు వచ్చేయువతులను మంచాలకు లేదా సోఫాలకు కట్టిపడేస్తారు. తరువాత మగాళ్లు చేతుల్లో మెషిన్‌గన్స్‌ను వారి మర్మాయవాలలో జొప్పిస్తారు. విలవిలలాడే వారి కళ్లు విరిచివేస్తారు. పెడబొబ్బలు వారి చెవికి సోకవు. ఓ ముసలి అరబ్ వ్యక్తి తన ముందున్న యువతి చేయి విరిగి కింద పడితే అది నుజ్జునుజ్జు అయ్యేలా తొక్కిపడేసాడు’ ఇంతకు మించిన భయానక వికృత చర్య మరోటి ఉంటుందా? అని సామాజిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇక యువతులను ఆకర్షించేందుకు ఏకంగా జిమ్‌లలో ఓ వెబ్‌సైట్ గురించి ప్రచారం చేస్తారు. ఔట్‌ప్లేడ్‌బైజాడే సైట్‌తో విటులు వారిని లొంగదీసుకుంటారని వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News