Thursday, July 3, 2025

సొమాలియాలో హెలికాప్టర్ కూలి ముగ్గురి మృతి

- Advertisement -
- Advertisement -

సొమాలియా రాజధాని మొగడిషు విమానాశ్రయంలో బుధవారం మిలిటరీ హెలికాప్టర్ కూలి ముగ్గురు మృతి చెందారు. లోయర్ షెబెల్లే రీజియన్ లోని బల్లిడూగుల్ నుంచి ఎనిమిది మందితో వచ్చిన ఈ హెలికాప్టర్ కూలిపోయిందని మొగడిషు ఏడెన్ అబ్దుల్లే విమానాశ్రయం ఇమ్మిగ్రేషన్ ఆఫీస్ అధిపతి అర్తాన్ మొహమ్మద్ చెప్పారు. అసలు ఈ హెలికాప్టర్ ఉగాండా ఎయిర్‌ఫోర్స్‌కు చెందినది. కానీ ఆఫ్రికన్ పీస్‌మేకింగ్ మిషన్ దీన్ని వినియోగిస్తోంది. ఇంకా మృతులను గుర్తించడానికి దర్యాప్తు సాగుతోందని సొమాలియా సివిల్ ఏవియేషన్ అధారిటీ డైరెక్టర్ జనరల్ అహ్మద్ మొయలిమ్ హస్సాన్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News