Thursday, July 3, 2025

నేనే సిఎంగా కొనసాగుతా: సిద్దరామయ్య

- Advertisement -
- Advertisement -

నాయకత్వం మార్పుపై ఊహాగానాలను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య బుధవారం నాడు మరో సారి తోసిపుచ్చారు. ఐదేళ్ల పాటు పూర్తి పదవికాలం తాను సిఎంగా కొనసాగుతానని స్పష్టం చేశారు. మీకు ఏమైనా సందేహం ఉందా అని
మీడియాను నిలదీశారు. కాగా, తనకు మరో గత్యంతరం లేదని, తాను ఆయనకు మద్దతు ఇవ్వాలని, హైకమాండ్ నిర్ణయమే తనకు శిరోధార్యం అని డిప్యూటీ సిఎం డికె శివకుమార్ అన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి పదవిని డికె శివకుమార్ కు ఇవ్వాలని పార్టీ శాసనసభ్యులు, ఆయన మద్దతు దారుల డిమాండ్ నేపథ్యంలో ఇద్దరు అగ్రనాయకులు ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నాయకత్వం మార్పుపై కొద్దికాలంగా

కొనసాగుతున్న రాజకీయ ఊహాగానాలకు ముగింపు పలికేందుకే సిద్దరామయ్య ఈ ప్రకటన చేశారని భావిస్తున్నారు. కర్ణాటకలో నాయకత్వం మారబోవడం లేదని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రణదీప్ సుర్జేవాలా మంగళవారం స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాత కూడా ఈ ప్రకటన వెలువడడం విశేషం. అయితే, బుధవారంనాడు శివకుమార్ చేసిన వ్యాఖ్య ఒకరోజు ముందు ఆయనే చెప్పినదానికి బిన్నంగా ఉంది. మంగళవారం నాడు తాను ముఖ్యమంత్రిపదవి ఆశించడం లేదని 2028 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం పైనే తాను పూర్తిగా దృష్టి కేంద్రీకరించవలసి ఉందని ఆయన అన్నారు. 2028లో మళ్లీ కాంగ్రెస్ ను రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి తీసుకురావడమే తన తక్షణ కర్తవ్యం అని డికే వివరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News