Thursday, July 3, 2025

పాశమైలారం ఫ్యాక్టరీ ప్రమాదంపై దర్యాప్తుకు నిపుణులతో కమిటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: పటాన్ చెరులోని పాశమైలారం సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదంపై దర్యాప్తుకు రాష్ట్ర ప్రభుత్వం నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో బి.వెంకటేశ్వర్,(ఏమిరేట్ సైంటిస్ట్) చైర్మన్‌గా, ప్రతాప్ కుమార్ చీఫ్ సైంటిస్ట్, డా. సూర్యనారాయణ (రిటైర్డ్ సైంటిస్ట్), సంతోష్, సేఫ్టీ ఆఫీసర్ పూణె సభ్యులుగా ఉన్నారు. ఈ ప్రమాదంపై నెల రోజుల్లో దర్యాప్తు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, నిన్న ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటివరకు 40 మంది మృతి చెందారని, 33 మందికి గాయాలైనట్టు కంపెనీ సెక్రటరీ వివేక్‌ కుమార్ వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారంతో పాటు అన్ని రకాల బీమా క్లెయిమ్‌లు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

ఇక, ఘటనాస్థలాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఫ్యాక్టరీలో బీహార్, ఎంపి, ఎపి, ఒడిశా ప్రాంతాలకు చెందినవారు పని చేస్తున్నట్టు తెలిసిందని అన్నారు. యాజమాన్యంతో చర్చించి, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు, వికలత్వం సంభవించి విధులకు వెళ్లలేని వారికి రూ.10 లక్షలు, స్వల్పంగా గాయపడి పని చేసుకోగలిగిన వారికి ఐదేసి లక్షలు పరిహారం అందేలా చూస్తామని అన్నారు. ఈ దుర్ఘటనలో క్షతగాత్రులకు అయ్యే వైద్య ఖర్చులన్నీ నూటికి నూరు శాతం తమ ప్రభుత్వం భరిస్తుందని భరోసా ఇచ్చారు. బాధిత కుటుబాల్లోని పిల్లలకు ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యను అందిస్తామని తెలిపారు. తక్షణ సాయంగా మృతుల కుటుంబాలకు రూ. లక్ష, గాయపడిన వారికి రూ.50 వేలు జిల్లా కలెక్టర్ నిధుల నుంచి ఇస్తున్నట్టు సిఎం ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News