బర్మింగ్‌హామ్: ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించిన టీమిండియా బ్యాటింగ్ లో తడబడుతోంది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్(87) అర్థ శతకం రాణించడంతో ఇన్నింగ్స్ ప్రారంభంలో మంచి భాగస్వామ్యం దొరికినా.. తర్వాత ఇంగ్లాండ్ బౌలర్లు చెలరేగడంతో బారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. కెఎల్ రాహుల్(2) నిరాశ పర్చగా.. కరణ్ నాయర్(31), పంత్(25)లు భారీ స్కోరు చేయడంలో విఫలమయ్యారు. వీరి తర్వాత క్రీజులోకి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి ఒక పరుగుకే ఔటై.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అయితే, కెప్టెన్ శుభ్ మన్ గిల్ అర్థ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. కీలక వికెట్లు కోల్పోయినా జట్టు స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం 65 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 223 పరుగులు సాధించింది. క్రీజులో గిల్(70), రవీంద్ర జడేజా(04)లు ఉన్నారు.
ఇంగ్లాండ్తో రెండో టెస్టు.. ఐదో వికెట్ కోల్పోయిన భారత్
- Advertisement -
- Advertisement -
- Advertisement -