Thursday, July 3, 2025

మా యూరియా కోటా మాకివ్వండి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రైతుల హితం కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించి న నెలవారీ యూరియా కోటలను వెంటనే వి డుదల చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తు మ్మల నాగేశ్వరరావు కేంద్రానికి విజ్ఞప్తి చేశా రు. ఈ మేరకు బుధవారం కేంద్ర మంత్రులు ప్రకాశ్ నడా, జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ల కు మంత్రి తుమ్మల వేర్వేరుగా లేఖలు రాశా రు. రాష్ట్రంలో యూరియ లోటు కారణంగా రైతులు రానున్న రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఆలేఖలో స్పష్టం చే శారు. ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయాన్ని మంత్రి తు మ్మల గుర్తుచేశారు. రాష్ట్రానికి ప్రాతినిధ్యం వ హిస్తున్న కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు యూరియా కోటా విషయంలో చొరవచూపాలని
మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఖరీఫ్- 2025 సాగు మొదలై పంటల సాగు ఊపందుకుంటున్న సమయంలో యూరియా సరఫరాలో కేంద్ర ప్రభుత్వం వహిస్తున్న అలసత్వం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి తెలిపారు. ప్రస్తుత సీజన్ లో రైతులకు అవసరమయ్యే డిమాండ్ మేరకు యూరియా ఎరువుల సరఫరాలో నెలవారి లోటు ఉందని వెల్లడించారు.

తొలిత్రైమాసికం నుంచే లోటు
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్, మే, జూన్ నెలల్లో రాష్ట్రానికి కేటాయించిన యూరియా మొత్తం ఐదు లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ఇప్పటి వరకు కేవలం 3.06 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే సరఫరా అయిందని మంత్రి తుమ్మల లేఖల్లో పేర్కొన్నారు. దీని ఫలితంగా 1.94 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా లోటు ఏర్పడిందని తెలిపారు. ఏప్రిల్ నెలలో 1.70 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించగా 1.22 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే అందిందని, అదేవిధంగా మే నెలకు సంబంధించి 1.60 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించగా 0.88 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందిందన్నారు. జూన్ నెలకు సంబంధించి 1.70 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించగా

అందులో కేవలం 0.96 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే రాష్ట్రానికి అందిందని వ్యవసాయశాఖ మంత్రి తన లేఖల్లో వివరించారు. ఇందులో ముఖ్యంగా దిగుమతి(ఇంపోర్ట్) రూపంలో రావాల్సిన యూరియాలో 0.41 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించగా కేవలం 0.13 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే అందిందని, మే లో 1.11 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించగా కేవలం 0.42 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే అందిందని, జూన్ లో 1.08 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించగా కేవలం 0.81 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే అందినట్లు మంత్రి తుమ్మల వివరించారు.యూరియా వినియోగం ఎక్కువ వానాకాలంలో సీజన్ లో పంటలకు యూరియా వినియోగం అధికంగా ఉంటుందని తెలిపారు. అందువల్ల ప్రస్తుత జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో యూరియా అందకపోతే రైతుల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని మంత్రి వివరించారు.

కేంద్ర మంత్రులు చొరవ తీసుకోవాలి
యూరియా కేటాయింపులు, సరఫరాలో తేడాలు ఉండడం వల్ల రాష్ట్రంలో రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటారని, రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్రమంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈ విషయంలో చొరవ తీసుకోవాలని మంత్రి తుమ్మల కోరారు. రాష్ట్రానికి రావాల్సిన యూరియా కోటాను తక్షణమే పంపిణీ చేసే విధంగా కేంద్రం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. జూలై 2025 కి కేటాయించిన 0.97 లక్షల మెట్రిక్ టన్నుల దిగుమతి యూరియాను తక్షణమే నౌకాశ్రయాల ద్వారా సరఫరా చేయాలని సూచించారు. రాష్ట్రానికి రవాణా సౌలభ్యం కలిగిన రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ నుంచి యూరియా కేటాయింపును 30,800 మెట్రిక్ టన్నుల నుంచి 60,000 మెట్రిక్ టన్నులకు పెంచాలని కోరారు. ఏప్రిల్-, జూన్ మధ్యలో వచ్చిన లోటును పూడ్చడానికి అదనపు సరఫరా ప్రణాళిక మంజూరు చేయాలని మంత్రి తుమ్మల కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News