Thursday, July 3, 2025

తండ్రిని హతమార్చిన కసాయి కొడుకు

- Advertisement -
- Advertisement -

కన్న కొడుకే అతి కిరాతకంగా తండ్రిని కత్తితో నరికాడు. దాచుకున్న డబ్బులు ఖర్చు చేస్తున్నాడని మందలించడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల … గచ్చిబౌలిలోని ఎన్టీఆర్ నగర్ కాలనీకి చెందిన హనుమంతు (37) కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతని భూమిని తాకట్టులో పెట్టి 6 లక్షల రూపాయలను తండ్రికి తెలియకుండా కొడుకు రవీందర్ (19) బెట్టింగ్‌లో పెట్టి మొత్తం పొగొట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న తండ్రి హనుమంతు రో జు మందలించడంతో ఎలాగైనా హత్య చేయాలని అనుకున్నాడు.

మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయం లో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి కత్తితో మెడపైన ఇతర ప్రదేశాలలో నరికి హత్య చేశాడు. అనంతరం ఏమి తె లియనట్టు మృతుడి తమ్ముడు రమేష్‌కి ఫోన్ చేసి తన తండ్రి తనకు తానుగా కత్తితో పొడుచుకుని చనిపోయాడని నమ్మబలికాడు. రమేష్ పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. కొడుకు రవీందర్‌పైన అనుమానం రావడంతో అతన్ని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News