మన తెలంగాణ / ఆత్మకూర్: జూరాల ప్రాజెక్టు హై లెవల్ రోడ్డు బ్రిడ్జి నిర్మాణం కొరకు రూ.121. 92 కోట్ల నిధులు మంజూరు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీఓ విడుదల చేయడం పట్ల మండల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు రహమతుల్లా పరమేష్ నల్గొండ శ్రీనివాసులు తులసి రాజు యాదవ్, దామోదర్ మాట్లాడుతూ భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి జూరాల ప్రాజెక్టు సందర్శనలో భాగంగా ఇచ్చిన హమీ మేరకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ జీఓను జారీ చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. రాష్ట్ర పశువర్ధక మత్స యువజన శాఖ మంత్రి డా. వాకిటి శ్రీహరి కృషి వలన హై లెవెల్ రోడ్డు బ్రిడ్జి కోసం భారీ నిధులు ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలిపారు.
గత పరిపాలనలో జూరాల ప్రాజెక్టును పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. ప్రజా సమస్యల ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, ప్రాజెక్టుపై వంతెన నిర్మాణం కొరకు నిధులు విడదల చేయడం పట్ల ప్రాజెక్టు ఆయకట్టు రైతులు గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరికి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయి, రాఘవ, గాలి పంపు శ్రీను, ఆశోక్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.