మన తెలంగాణ/కందిః సిగాచి పరిశ్రమలో రియాక్టర్ పేలుడులో 50మంది కార్మికులు చనిపోవడం మరో 15మంది కార్మికులు శిథిలాల కింద ఉండిపోవడం బాధకరమని హెచ్‌ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్ ప్రసాద్ అన్నారు. బుధవారం కంది మండలంలోని ఓడిఎఫ్ కంపెనీ ముందు హెచ్‌ఎంఎస్ యూనియన్ ఆద్వర్యంలో సిగాచి పరిశ్రమ మృతులకు బాదితులకు శాంతి చేకూరాలని కోరుతూ మౌనం పాటించి ఫార్మా కంపెనీల దుర్మార్గాలను అరికట్టాలంటూ ఓడిఎఫ్ కార్మిక సంఘాల ఆద్వర్యంలో కార్మికులు తీర్మానం చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లడుతూ.. గత బిఆర్‌ఎస్ పాలనలో 202సంవత్సరంలో తీసుకువచ్చిన ఈజీ డూయింగ్ బిజినెస్ పేరుతో సిగాచీ కంపెనీలో దుర్ఘటన చోటుచేసుకుందన్నారు. పరిశ్రమల శాఖ ఇన్స్‌పెక్టర్‌లు, లేబర్ ఆఫీసర్‌లు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కంపెనీలను పరిశీలించే అధికారాలను తొలగించి కార్పోరేట్ సంస్థలకు అనుకూలంగా థర్డ్ పార్టీ పేరిట అనుకూలమైన నిబంధనలతో జిఓను తీసుకువచ్చారన్నారు. గత బిఆర్‌ఎస్ పాలనలో తీసుకువచ్చిన జిఓను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రద్దు చేసి ఫార్మా కంపెనీల ఆగడాలపై దృష్టిసారించాలని కోరారు. మృతి చెందిన బాధిత కుటుంబలను ప్రభుత్వం అన్ని విధాలుగా దుకొని న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్నీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఓడిఎఫ్ కంపెనీ యూనియన్ నేతలు, కార్మికులున్నారు.