ఇంగ్లండ్‌తో రెండో టెస్టు
బర్మింగ్‌హామ్: భారత్‌తో బుధవారం ప్రారంభమైన రెండో టెస్టులో భారత్ తాజా సమాచారం లభించే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 80 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న గిల్ 11 ఫోర్లతో 102 పరుగులు చేసి క్రీజులో నిలిచాడు. అతనికి రవీంద్ర జడేజా (35) నాటౌట్ అండ గా నిలిచాడు. ఒక దశలో 211 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన జట్టును గిల్, జడేజా ఆదుకున్నారు. ఇక మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్‌ను ఎంచుకుంది.
తొలి టెస్టులో సెంచరీతో రాణించిన కెఎల్ రాహుల్ ఈసారి నిరాశ పరిచాడు. 26 బంతులు ఎదుర్కొన్న రాహుల్ కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన కరుణ్ నాయర్‌తో కలిసి మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. ఇద్దరు కుదురుగా ఆడడంతో భారత్ కోలుకుంది. ఇటు యశస్వి అటు నాయర్‌లు ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు.
ఈ జోడీ ని విడగొట్టేందుకు ఇగ్లండ్ బౌలర్లు చాలా సేపటి వరకు నిరీక్షించాల్సి వచ్చింది. అయితే 50 బంతుల్లో 5 ఫోర్లతో 87 పరుగులు చేసిన నాయర్‌ను కార్స్ వెనక్కి పంపాడు. దీంతో 80 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. మ రోవైపు దూకుడైన బ్యాటింగ్‌ను కనబరిచిన యశస్వి 107 బంతుల్లో 13 ఫోర్లతో 87 పరుగులు చేసి ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ బౌలింగ్లో వెనుదిరిగాడు. ఈ క్రమంలో తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. మరోవైపు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరోసారి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. యశస్వితో కలిసి మూడో వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యంలో పాలు పంచుకున్నాడు.