Friday, July 4, 2025

రోడ్డు ప్రమాదం… ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం హపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హఫీజ్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ ను  భారీ వాహనం ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మజీద్ పూర్ కు చెందిన దినేష్ తన ఇద్దరు కూతుళ్లు, కుమారుడు, స్నేహితుడు కుమారుడితో కలిసి బైక్ పై వెళ్తుండగా భారీ వాహనం ఢీకొట్టింది. ఐదుగురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. ఎఎస్ పి వినీత్ భటాగర్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్విమ్మింగ్ ఫూల్ నుంచి ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News