Friday, July 4, 2025

సిద్దిపేటలో రోడ్డు ప్రమాదం… ఫిల్మ్‌నగర్ ఎస్‌ఐ మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సిద్దిపేట జిల్లా చేర్యాల గేటు వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, కారు ఢీకొనడంతో ఫిల్మ్‌నగర్ ఎస్‌ఐ రాజేశ్వర్ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం… సంగారెడ్డిలోని చాణక్యపురి కాలనీ చెందిన రాజేశ్వర్ 1990లో పోలీస్ శాఖలో ఎస్ఐగా ఉద్యోగంలో చేరారు. వారం రోజుల క్రితమే హైదరాబాద్ లోని  ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు. గత మూడు రోజుల నుండి బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద ఎస్ఐ రాజేశ్వర్ విధి నిర్వహణలో ఉన్నారు.  బుధవారం అర్ధరాత్రి బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద ఎస్‌ఐ రాజేశ్వర్ విధులు ముగించుకొని సొంతూరుకు వెళ్తుండగా అతడి ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టింది.  సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదంలో గాయపడ్డ ఎస్సై రాజేశ్వర్ ను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేస్తుండగానే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News