- Advertisement -
అనిల్ సుంకర సమర్పణలో స్కై లైన్ మూవీస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కిషోర్ గరికిపాటి నిర్మాతగా మదన్ దక్షిణామూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం షో టైం. (Show time) నవీన్ చంద్ర హీరోగా కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ వినూత్నమైన థ్రిల్లర్ (Innovative thriller)విడుదలకు సిద్ధమైంది. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో నవీన్ చంద్ర మాట్లాడుతూ “ఒక ఫ్యామిలీలో తక్కువ క్యారెక్టర్ల నడుమ సాగే ఈ కథలో ఎన్నో మలుపులు ఉన్నాయి. ప్రతీ అంశం ప్రేక్షకుడిని రంజింప చేస్తుంది”అని అన్నారు. డైరెక్టర్ మదన్ దక్షిణామూర్తి మాట్లాడుతూ “ఇది దృశ్యం సినిమాకు భిన్నంగా ఉంటుంది. ట్రైలర్ చూసి అలా అనిపించినా సినిమా చాలా కొత్తగా, చాలా ఆసక్తిగా ఉంటుంది”అని తెలిపారు. రాజా రవీంద్ర మాట్లాడుతూ “సినిమాలో చాలా మంచి పోలీసు క్యారెక్టర్ చేశానని తెలియజేశారు.
- Advertisement -