Monday, August 18, 2025

‘ అఖండ 2’ లో జననిగా..

- Advertisement -
- Advertisement -

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను ’అఖండ 2’ (Akhanda 2) తాండవం’ కోసం నాలుగవ సారి కలిసి పనిచేస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం. తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు. మేకర్స్ బుధవారం జననిగా హర్షాలీ మల్హోత్రా ఫస్ట్ లుక్‌ను (Harshaali Malhotra’s first look Janani) రిలీజ్ చేశారు. సల్మాన్ ఖాన్ బజరంగీ భాయిజాన్‌లో చైల్ ఆర్టిస్ట్‌గా కనిపించిన హర్షాలీ మల్హోత్రా అఖండ 2తో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. ఆమె సాంప్రదాయ చీరలో అందమైన చిరునవ్వుతో అద్భుతంగా కనిపిస్తోంది. సంయుక్త హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. అఖండ 2 సిని మా దసరా కానుకగా సెప్టెంబర్ 25న భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News