Friday, July 4, 2025

మధ్యతరగతి కుటుంబం నేపథ్యంలో..

- Advertisement -
- Advertisement -

సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వినాద్రి, బేబీ నేహా శ్రీ సమర్పణలో సెవెన్ హిల్స్ సతీష్ నిర్మాతగా నవీన్ కుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సోలో బాయ్.(Solo Boy) బిగ్ బాస్ సీజన్ 7 ఫేమ్ గౌతం కృష్ణ హీరోగా రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి జుడా సంధ్య సంగీతాన్ని అందించారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వివి వినాయక్ ముఖ్య అతిథిగా రఘు కుంచే, కేఎల్ దామోదర్ ప్రసాద్, ప్రసన్నకుమార్ తదితరులు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివి వినాయక్ మాట్లాడుతూ “ఈ చిత్రంలో నటించిన గౌతమ్ కృష్ణకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా మంచి విజయం సాధించి సతీష్ ప్రయాణానికి తోడ్పడాలని కోరుకుంటున్నాను”అని అన్నారు.

నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్ మాట్లాడుతూ… “ఈ సినిమా గౌతం సినీ కెరీర్‌లో ఒక మంచి మైల్ స్టోన్ కావాలని కోరుకుంటున్నాను. ఈ సోలో బాయ్ చిత్రం ప్రేక్షకులందరికీ నచ్చుతుంది”అని పేర్కొన్నారు. దర్శకుడు నవీన్ కుమార్ మాట్లాడుతూ… “ఈ సినిమాలో గౌతమ్ కృష్ణ ఎంతో అద్భుతంగా నటించారు. అలాగే ఇద్దరు హీరోయిన్లు తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు” (Impress audience) అని తెలిపారు. హీరో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ… “మధ్యతరగతి కుటుంబంలో ఉండే ఎన్నో విషయాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయి. దర్శకుడు నవీన్ కుమార్ ఈ సినిమాను మంచి అవుట్‌పుట్‌తో రూపొందించాడు”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్లు శ్వేత అవస్తి, రమ్య పసుపులేటి, అనిత చౌదరి, ఆట సందీప్, లిరిసిస్ట్ పూర్ణచారి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News