హైదరాబాద్: వివాహేతర సంబంధాలే భార్యభర్తల ప్రాణాలు తీస్తున్నాయి. మామతో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉండడంతో నవ వరుడిని వధువు హత్య చేయించింది. ఈ సంఘటన బిహార్ రాష్ట్రం ఔరంగాబాద్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గుంజాదేవి(20) అనే యువతి 45 రోజుల క్రితం ప్రియాంశును పెళ్లి చేసుకుంది. పెళ్లికి ముందే దేవీ మామ జీవన్‌సింగ్‌తో(55) అక్రమ సంబంధం పెట్టుకుంది. జీవన్‌ను పెళ్లి చేసుకుంటానని పలుమార్లు కుటుంబ సభ్యులకు చెప్పింది. కుటుంబ సభ్యులు బలవంతంగా ప్రియాంశుతో ఆమెకు పెళ్లి చేశారు. దీంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని భార్య తన ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. మామ, గుంజాదేవి కలిసి సుపారీ గ్యాంగ్‌తో డీల్ కుదుర్చుకున్నారు.
గత 25న ప్రియాంశు తన సోదరి ఇంటికి రైలులో వెళ్లాడు. నవీనగర్ స్టేషన్ నుంచి ఇంటికి వస్తుండగా మార్గ మధ్యలో అతడిపై గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. ప్రియాంశు ఘటనా స్థలంలోనే చనిపోవడంతో పోలీసులు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరక కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గుంజాదేవి గ్రామం నుంచి పారిపోతుండగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో పాటు కాల్ డేటాను పరిశీలించగా నిజాలు బయటకు వచ్చాయి. కోడలు, సుపారీ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జీవన్ సింగ్ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.