Friday, July 4, 2025

సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ఇంటింటికెళ్తున్నాం: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఈ ఏడాది ఎప్పుడూ లేని దిగుబడి వచ్చిందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తెలిపారు. రైతులను అన్ని విధాల ఆదుకునే ప్రభుత్వం తమది అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన కుప్పంలో మీడియాతో మాట్లాడుతూ..ప్రపంచంలో ఆహారపు అలవాట్లు మారాయని, ఏ పంట పండిస్తే లాభదాయకమో కూడా ఆలోచిస్తున్నామని చెప్పారు. పుడ్ ప్రాసెసింగ్, ఇంటర్నేషనల్ మార్కెటింగ్ పై చర్చిస్తున్నామని, మారిన ఆహారపు అలవాట్లకు అనుగుణంగా పంటలసాగు చేయాలి అని రైతులకు సూచించారు. ఆధునిక పద్ధతుల ద్వారా వ్యవసాయంలో లాభాలు పెరుగుతాయని అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ఇంటింటికెళ్తున్నాం అని తెలియజేశారు. ఏమి చేయలేని వాళ్లే శవ రాజకీయాలు చేస్తుంటారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఏనాడైనా రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారా? అని గత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

రాయసీమలో ఒకేసారి రూ.3,950 కోట్లు హంద్రీనీవాకు డబ్బులిచ్చామని, మైక్రో ఇరిగేషన్ కు 90 శాతం సబ్సిడి ఇస్తున్నామని పేర్కొన్నారు. పంటలకు ప్రాధాన్యత ఇస్తూ గిట్టుబాటు వచ్చేలా చేస్తున్నామని చెప్పారు. రైతుకు ఎక్కువ ఆదాయం రావాలని వాణిజ్య పంటలకు (commercial crops) వెళ్లమని చెబుతున్నామని, అయితే ఒక్కోసారి వాణిజ్య పంటల్లో తక్కువ రేట్లు కూడా వస్తాయని అన్నారు. అనేక ఇబ్బందులను అధిగమించి ముందుకెళ్తున్నామని, ప్రభుత్వం ఒక్క ఆడబిడ్డకే అమ్మఒడి ఇచ్చిందని చంద్రబాబు తెలిపారు. ఎంతమంది పిల్లలు ఉన్నా తాము తల్లికి వందనం ఇస్తున్నామని, అర్హులు ఎంతమంది ఉన్నా పింఛన్లు అందిస్తున్నామని అన్నారు. తాను ఎక్కడికెళ్లినా భూముల విషయంలోనే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని, లింక్ డాక్యుమెంట్లు లేకుండా చేయడం వల్ల జవాబుదారీతనం లేకుండా పోయిందని గత ప్రభుత్వాన్ని చంద్రబాబు విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News