- Advertisement -
హైదరాబాద్: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు. హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం, ఈ దేశ శ్రమ బాద్‌షా పాదాల కింద నలిగిపోతున్న సమయం, ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం, గోల్కొండ నుండి ఒక వీరుడు బయలుదేరాడు, వాడు ప్రాణాలతో ఢిల్లీకి చేరుకోకూడదు అనే డైలాగులు బాగున్నాయి. సింహాసనామా, మరణశాసనామా? అనే మాటలు రక్తి కట్టిస్తున్నాయి. ఈ సినిమాలో పవన్‌కు జోడిగా నిధి అగర్వాల్ నటిస్తున్నారు. ఈ సినిమా క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ లో ఎంఎం రత్నం నిర్మిస్తున్నారు. జులై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
- Advertisement -