హైదరాబాద్: ఒత్తిడిలో కెప్టెన్ గిల్ కూల్‌గా ఉంటూ అద్భుతమైన బ్యాటింగ్‌తో సెంచరీ చేశాడని సచిన్ టెండూల్కర్ ప్రశంసించారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా మొదటి బంతి నుంచే తన బ్యాటింగ్ అంటే ఏంటో చూపించాడని, పాజిటివ్‌గా ఆడడంతో ఫియర్‌లెస్‌గా కనిపించాడని, బ్యాటింగ్‌లో స్మార్ట్‌తో అగ్రెసివ్ కనిపించడని జైస్వాల్‌ను సచిన్ కొనియాడరు. ఇద్దరు ఇన్నింగ్స్‌లు సూపర్‌గా ఉన్నాయని మెచ్చకున్నారు. ఇద్దరు కుర్రాళ్లు క్లాసిక్ గేమ్‌తో అదరగొట్టారని పొగిడారు. భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండు టెస్టు తొలి ఇన్నింగ్స్ మొదటి రోజు టీమిండియా 85 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 310 పరుగులు చేసింది.
శుభ్ మన్ గిల్ సెంచరీ చేయడంతో పాటు యశస్వి జైస్వాల్ 87 పరుగులతో ఔరా అనిపించాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో సెంచరీలు చేసిన టీమిండియా బ్యాట్స్‌మెన్ల జాబితాలో గిల్ చేరాడు. ఈ మైదానంలో సచిన్, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్‌లు సెంచరీలు చేశారు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 147 పరుగులు చేసి తొలి స్థానంలో ఉన్నాడు. రెండో రోజు జడేజా, వాషింగ్టన్ సుందర్ మెరుగైన బ్యాటింగ్ చేస్తేనే ఇంగ్లాండ్ పై పైచేయి సాధిస్తామని క్రికెట్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. తొలి టెస్టులో లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ చేయకపోవడంతోనే ఓడిపోయామని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ టెస్టులో రవీంద్ర జడేజా సెంచరీతో చేయడంతో పాటు సుందర్ హాఫ్ సెంచరీ చేస్తే గెలిచే అవకాశం ఉంటుందని కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.