Friday, July 4, 2025

తల, మొండెం వేరు చేసి రోడ్డు పక్కన పడేశారు..

- Advertisement -
- Advertisement -

అమరావతి: తల, మొండెం వేరు చేసి ఓ వ్యక్తిని హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బార్గవి దాబా దగ్గరలో తల, మొండెం వేర్వేరుగా కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో మిస్సింగ్ అయిన వ్యక్తుల వివరాలతో పాటు స్థానిక సిసి కెమెరాలను పరిశీలించి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News