Friday, July 4, 2025

బిసిల కోసం కవిత ఎక్కడ ఉద్యమం చేసింది :మహేష్ కుమార్ గౌడ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎమ్మెల్సి కవిత లేఖ రాసింది బిఆర్ఎస్ నేతగానా? జాగృతి నాయకురాలిగానా? అని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ప్రశ్నించారు. బిసిల కోసం కవిత ఉద్యమం ఎక్కడ చేసింది అని అన్నారు. కవితకు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో బిసి బిల్లు చేసేటప్పుడు కవిత జైల్లో ఊచలు లెక్కపెడుతోందని విమర్శించారు. కవిత ఇప్పటిదాకా బిసిల కోసం ఒక్క మాట మాట్లాడిందా? అని రాజకీయ శూన్యంలో ఉన్న కవిత ఉనికి కోసమే మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు. పదేండ్లు బిసిలకు మాజీ సిఎం కెసిఆర్ ఏం చేశారు? అని మహేష్ గౌడ్ ప్రశ్నించారు.

బిసిల రిజర్వేషన్లు (BC reservations) తగ్గించింది కెసిఆర్ కాదా? అని నిలదీశారు. కాంగ్రెస్ లో కోవర్టులున్నారన్న ఎమ్మెల్యే అనిరుధ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనిరుధ్ వ్యాఖ్యలపై తీవ్రంగా పరిగణిస్తున్నామని, పార్టీ నేతలు మాట్లాడేటప్పుడు చూసుకుని మాట్లాడాలని సూచించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడితే ఎలా? అని మండిపడ్డారు. క్రమశిక్షణ విషయంలో రాజీపడేది లేదని, బనకచర్లపై అసెంబ్లీలో చర్చకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News