- Advertisement -
అమరావతి: ప్రజలకు నిరంతరాయ విద్యుత్ అందించడమే లక్ష్యం అని ఎపి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Gottipati Ravikumar) తెలిపారు. లో వోల్టేజ్ సమస్యలకు చెక్ పెట్టేందుకు జిల్లా వ్యాప్తంగా సబ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో గొట్టిపాటి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లాకు ఇప్పటి వరకు 6 సబ్ స్టేషన్లు మంజూరు చేశామని, మంత్రిగా బాధ్యతలు చేపట్టేటప్పుడు 45 వేల వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చామని తెలియజేశారు. రైతులకు ఇబ్బంది లేకుండా మరో 25 వేల వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చామని, వ్యవసాయానికి 9 గంటలు ఉచిత ఉద్యుత్ అందించామని గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.
- Advertisement -