- Advertisement -
ఢిల్లీలోని ఎయిమ్స్ ట్రామా సెంటర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం సెంటర్ లోని ఒక ట్రాన్స్‌ఫార్మర్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. ఎనిమిది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ (DFS) అధికారి తెలిపారు. “మధ్యాహ్నం 3.34 గంటలకు ఎయిమ్స్ ట్రామా సెంటర్‌లోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లో పేలుడు సంభవించి మంటలు చెలరేగినట్లు మాకు కాల్ వచ్చింది. మేము 8 అగ్నిమాపక యంత్రాలను సంఘటనా స్థలానికి తరలించి మంటలను అదుపులోకి తెచ్చారు” అని DFS చీఫ్ అతుల్ గార్గ్ తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు గానీ, ప్రాణనష్టం గానీ జరగలేదని అధికారి తెలిపారు.
- Advertisement -