టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌పై భారత మాజీ క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. అంతేగాక అద్భుత బ్యాటింగ్‌తో అలరించిన సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను కూడా సచిన్ ప్రశంసించాడు. రెండో టెస్టు తొలి రోజు ఆటలో యశస్వి, గిల్ ఆట తనను ఎంతో ఆకట్టుకుందన్నాడు. తీవ్ర ఒత్తిడిలోనూ ఇద్దరు అసాధారణ బ్యాటింగ్‌ను కనబరిచారన్నాడు.ఇది రానున్న రోజుల్లో టీమిండియాకు శుభ సూచక మన్నారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సెంచరీతో నమోదు చేయడం ఎంతో ఆనందం కలిగించిందన్నాడు. భవిష్యత్తులో గిల్ ఇలాంటి ఇన్నింగ్స్‌లు మరిన్ని ఆడడం ఖాయమన్నాడు. అతనిలో అపార ప్రతిభ దాగివుందన్నాడు. జడేజా కూడా తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడన్నాడు. సీనియర్లు రోహిత్, కోహ్లిలు లేని లోటును యువ ఆటగాళ్లు సమర్థవంతంగా భర్తీ చేస్తున్నారని సచిన్ ఆనందం వ్యక్తం చేశాడు.
కుర్రాళ్లపై సచిన్ ప్రశంసలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -