న్యూఢిల్లీ: కోకాకోలా ఇండియాలోని ఐకానిక్ మ్యాంగో బ్రాండ్ మాజా, తన నూతన క్యాంపెయిన్ “మేరీ ఛోటీ వాలీ జీత్”ను ప్రారంభించింది. ఇది ఒక AI ఆధారిత డిజిటల్ వేదిక, జనం జీవితంలోని చిన్న కానీ ప్రత్యేకమైన విజయాలను యానిమేటెడ్ కథలుగా మార్చుతుంది. వినియోగదారులు తమ ఫోటోను అప్లోడ్ చేసి, ఓ చిన్న కథను పంచుకోవాల్సి ఉంటుంది. ఓగిల్వీ ఇండియా అభివృద్ధి చేసిన ఈ ప్లాట్‌ఫామ్, అటువంటి చిన్న క్షణాలను మాజా శైలిలో వ్యక్తిగతీకరించిన యానిమేటెడ్ వీడియోలుగా రూపొందించడం ద్వారా రోజువారీ క్షణాలను చిరస్మరణీయ కథలుగా మారుస్తుంది.
తరచూ పెద్ద విజయాలకే గౌరవం లభించే ఈ ప్రపంచంలో, మాజా ఒక కొత్త దారిని ఎంచుకుంది. వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేసిన చిన్న ఫోటో ఒక కథగా మారుతుంది. గిటార్ మీద కొత్త పాట నేర్చుకోవడం, ఆఫీస్‌లో ప్రశంసలు అందుకోవడం లేదా ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న పనిని చివరికి పూర్తిచేయడం — ఇవి అన్నీ మామూలు క్షణాలుగా కనిపించినా, వాటికీ ప్రత్యేకత ఉంది. మాజా నమ్మే సిద్ధాంతం సరళంగా ఉంది – ప్రతి చిన్న విజయం అనుభూతి చెందదగినదే. ఆ క్షణం వచ్చినప్పుడు, “మాజా హో జాయే!”
మిస్టర్. అజయ్ కొనాలే, డైరెక్టర్-మార్కెటింగ్, న్యూట్రిషన్ కేటగిరీ, కోకాకోలా ఇండియా మరియు నైరుతి ఆసియా ఇలా అన్నారు, “ఈ సంవత్సరం ప్రారంభంలో మేము మాజా కోసం ‘రోజువారీ చిన్న విజయాలకై తక్షణ ట్రీట్’ అనే కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ మీద గృష్టి పెట్టాము. ‘మేరీ ఛోటీ వాలీ జీత్’ అనే కొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా, మేము వినియోగదారుల ఎంగేజ్‌మెంట్‌ను అభివృద్ధి చేసిన విధానాన్ని తదుపరి దశకు తీసుకెళ్తున్నాము, అది సంతోషాన్ని వ్యక్తపరిచేలా, సహజమైనదిగా మరియు సోషల్‌గా పంచుకోదగినదిగా ఉంటుంది. మా వినియోగదారుల డిజిటల్ జీవనశైలి మారుతున్న కొద్దీ, మాజా కూడా అభివృద్ధి చెందుతుంది— చిన్నవి అయినా కూడా వారి విలువైన విజయాలను గౌరవిస్తూ, స్వచ్ఛమైన ఆనందాన్ని అందించాలనే మా అసలు దృష్టికి అనుగుణంగా ముందుకు సాగుతుంది.”
వ్యక్తిగతమైన అనుబంధాలతో, ఇంటిపరిసరాల్లో ఏర్పడే చిన్న కానీ విలువైన క్షణల నుంచి పుట్టిన మాజా తాజా ప్రచారానికి ప్రముఖ నటులైన జంట జెనీలియా మరియు రితేష్ దేశ్ముఖ్‌ను ప్రచార ముఖచిత్రంగా ఎంపిక చేసింది. ఒకరినొకరు ఉత్సాహపరచటం కాని, చిన్న విషయాల్లో పరస్పరం తోడుగా ఉండటం కాని — వీరిద్దరూ చూపించే సహజమైన అవగాహన, మాజా తన ప్రేక్షకులతో పంచుకునే నిరాడంబర బంధాన్ని ప్రతిబింబిస్తుంది.
జెనీలియా దేశ్‌ముఖ్ మాట్లాడుతూ, “జీవితంలో అత్యంత అందమైన క్షణాలు ఎప్పుడూ గొప్ప విజయాలపై ఆధారపడి ఉండవు. నా పిల్లలకు కొత్త డ్యాన్స్ స్టెప్ నేర్పడం, చివరకు పెయింటింగ్ పూర్తిచేయడం వంటి చిన్న, అనుకోని ఘనతలే నిజమైన సంతృప్తిని ఇస్తాయి, అదే ‘మేరీ ఛోటీ వాలీ జీత్’. ఒక తల్లిగా, పని చేసే మహిళగా నేను ప్రతి చిన్న విజయం వెనుక ఉన్న భావోద్వేగాన్ని గౌరవించడాన్ని నేర్చుకున్నాను. తరచూ కనిపించని ఈ చిన్న విజయాలను జరుపుకునేందుకు ఈ వేదిక ఒక చక్కని మార్గం,” అని అన్నారు.
రితేష్ దేశ్‌ముఖ్ మాట్లాడుతూ, “పెద్ద విజయాలే అందరి దృష్టిని ఆకర్షించే ఈ రోజుల్లో, నిజంగా మన మనసును ఉత్సాహంతో నింపేవి — రెసిపీ మొదలుపెట్టి పూర్తిచేయడం, లేదా ఓ కొత్త ఫుట్‌బాల్ ట్రిక్ నేర్చుకోవడం లాంటి చిన్న క్షణాలే. నా దృష్టిలో, ఇలాంటి రోజువారీ విజయాలను పంచుకోవడం జీవితాన్ని మరింత నిజమైనదిగా, గొప్పగా మార్చుతుంది. విజయం ఎంత చిన్నదైనా, ప్రతి ఒక్కరు తమను తాము జరుపుకోవాలని మాజా ప్రోత్సహించడం నిజంగా నాకు చాలా నచ్చిన విషయం,” అని అన్నారు.
ఈ ప్రచారాన్ని WPP పరిధిలోని ఓపెన్ఎక్స్ భాగంగా ఓగిల్వీ ఇండియా రూపొందించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మిస్టర్. సుకేశ్ నాయక్, చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్, ఓగిల్వీ ఇండియా ఇలా అన్నారు, “పెరుగుతున్న సంక్లిష్టతతో కూడిన ప్రపంచంలో, చిన్న విజయాలను జరుపుకోవాలన్న మాజా యొక్క ఆలోచన, జీవితాన్ని సుసంపన్నం చేసే సాధారణ ఆనందాల శక్తిపై నమ్మకంతో ప్రారంభమైంది. ఈ వేదిక సామాన్యుల అందాన్ని ప్రతిబింబిస్తూ, ప్రతి ఒక్కరిని తమను నిజంగా నవ్వించే చిన్న క్షణాలను గుర్తించి, అభినందించి, పంచుకోమని ఆహ్వానిస్తుంది. ఈ ప్రయత్నం, శ్రేయస్సు మరియు ఆనందం అనే పెద్ద భావనలో ప్రతి చిన్న విజయానికి అర్థం ఇచ్చే విధంగా రూపొందించబడింది.”
నిజమైన జూసీ అల్ఫోన్సో మామిడి పండ్లతో తయారైన మాజా, దశాబ్దాలుగా భారతదేశపు ప్రియమైన మామిడి పానీయంగా నిలిచింది. ఇప్పుడు, ఈ కొత్త డిజిటల్ అనుభవం ద్వారా, మాజా వినియోగదారులకు తమ రోజువారీ విజయాలను వెలుగులోనికి తెచ్చే ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందించడం ద్వారా బ్రాండ్‌తో తమ అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది.