Sunday, July 6, 2025

కరూర్ వైశ్యా బ్యాంక్ తో క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ ఒప్పందం

- Advertisement -
- Advertisement -

దేశ గ్రామీణ, వ్యవసాయ ఆధారిత వర్గాలకు జంట ప్రయోజనం చేకూర్చేలా ప్రత్యేకంగా రూపొందించిన – క్షేమ కిసాన్ సాథి – బీమా పథకాన్ని అందించేందుకు కరూర్ వైశ్యా బ్యాంక్ (కేవీబీ), క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ సంస్థలు వ్యూహాత్మక బ్యాంకెష్యూరెన్స్ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. కేవీబీ యొక్క గ్రామీణ, సెమీ-అర్బన్ బ్యాంకింగ్ సామర్థ్యాలు, క్షేమ యొక్క సాంకేతికత ఆధారితమైన బీమా సేవల దన్నుతో అసంఖ్యాక కస్టమర్లకు సంపూర్ణ ఆర్థిక భద్రత కల్పించేందుకు ఇది తోడ్పడనుంది.

భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి తోడ్పడటంలో కేవీబీకి దీర్ఘకాలంగా గల నిబద్ధతకు ఈ భాగస్వామ్యం నిదర్శనంగా నిలుస్తుంది. 109 ఏళ్లకు పైగా ఘన చరిత్ర గల కరూర్ వైశ్యా బ్యాంక్ తన సేవలను పటిష్టపర్చుకుంటూ, విశ్వసనీయతను నిలబెట్టుకుంటూ ఎప్పటికప్పుడు కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా తనను తాను తీర్చిదిద్దుకుంటూ ముందుకు సాగుతోంది. వ్యవసాయ వర్గాల కోసం తీర్చిదిద్దిన బీమా పథకం మరియు వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా ఈ ఒప్పందమనేది భారతదేశ బ్యాంకెష్యూరెన్స్ రంగంలో గణనీయమైన మార్పును తేనుంది. ఇది రెండు ప్రైవేట్ సంస్థల మధ్య వ్యాపార ఒప్పందం మాత్రమే కాదు, క్షేమ యొక్క టెక్నాలజీని, కేవీబీకి గల విస్తృత కస్టమర్ల బేస్‌ను ఉపయోగించుకుని వ్యవసాయ, గ్రామీణ ఆర్థిక సాధికారత కల్పించేందుకు, బీమా భద్రతను కల్పించేందుకు తోడ్పడనుంది. బీమా మాత్రమే కాకుండా క్రియాశీలకమైన స్థితిస్థాపకత, సన్నద్ధత, సుస్థిరతకు తోడ్పడే సాధనాలను కూడా అందించడం ద్వారా గ్రామీణ ప్రాంతానికి రక్షణ కవచంగా నిలవాలని క్షేమ లక్ష్యంగా నిర్దేశించుకుంది.

కరూర్ వైశ్యా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈవో రమేష్ బాబు ఈ భాగస్వామ్యం గురించి మాట్లాడుతూ, “భారతదేశపు గ్రామీణ ప్రాంతాల్లో మా బ్యాంకునకు పటిష్టమైన కార్యకలాపాలు ఉన్నందు వల్ల కస్టమర్లు రోజువారీగా ఎదుర్కొనే సవాళ్ల గురించి మాకు బాగా తెలుసు. క్షేమ కిసాన్ సాథీ రూపంలో మేము బీమా పథకాన్ని మాత్రమే కాదు నిశ్చింతను కూడా అందిస్తున్నాం. సుస్థిర జీవనోపాధికి తోడ్పాటునిచ్చే అర్థవంతమైన ఆర్థిక వ్యవస్థలను రూపొందించడంలో మా నిబద్ధతకు ఈ భాగస్వామ్యం నిదర్శనంగా ఉంటుంది. సమ్మిళిత బ్యాంకింగ్, అదనపు విలువను జోడించిన సాధనాల ద్వారా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనగలిగే స్థితిస్థాపకమైన, సురక్షితమైన, స్వయం సమృద్ధి గల గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సృష్టించాలనే మా దీర్ఘకాలిక విజన్‌కి అనుగుణంగా ఇది ఉంటుంది,” అని తెలిపారు.

క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ చైర్మన్ నటరాజ్ నూకల, ఈ భాగస్వామ్యం గురించి వ్యాఖ్యానిస్తూ, “ఈ వినూత్న బ్యాంకెష్యూరెన్స్ పథకమనేది కేవీబీ యొక్క అమూల్యమైన కస్టమర్లకు ఇటు పంట బీమా అటు వ్యక్తిగత ప్రమాద బీమాను కూడా అందించడం ద్వారా జీవనోపాధికి అలాగే కుటుంబానికి రెండు రకాలుగాను భద్రత కల్పిస్తుంది. గ్రామీణ ఎకానమీకి ఊతమిస్తూనే కోట్లాది గ్రామీణ కుటుంబాలు, అగ్రి ఎంట్రప్రెన్యూర్లకు ఆర్థిక భద్రత, స్థిరత్వం, స్వావలంబన కల్పించాలనే జంట లక్ష్యాల సాధనకు తోడ్పడేలా క్షేమ కిసాన్ సాథి రూపొందించబడింది. క్షేమ ప్రణాళికల్లో ఈ పధకాన్ని కీలకంగా పరిగణిస్తూ, ఈ ప్రత్యేకమైన బీమా సేవను, శాటిలైట్ ఇమేజెస్‌లాంటి సాంకేతికతను ఉపయోగించుకుని, బీమా మరియు డేటా ఆధారిత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అనుసంధానించి ముందస్తు అంచనాలు వేసేందుకు రూపొందించాము అని తెలిపారు.

బీమా లభ్యతను ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు కూడా విస్తరించాలన్న ప్రభుత్వ మరియు ఐఆర్‌డీఏఐ ఆదేశాలకు అనుగుణంగా, అలాగే 2047 నాటికి అందరికీ బీమా భద్రత లక్ష్యాన్ని సాకారం చేసుకునే దిశగా జాతీయ స్థాయిలో జరుగుతున్న కృషికి అనుగుణంగా ఈ భాగస్వామ్యం ఉంటుంది. కస్టమర్ల ప్రయోజనాలను పరిరక్షించడంలోను, ఆర్థిక సేవలను అందించడంలో అత్యంత విశ్వసనీయత కలిగిన కేవీబీ ఈ లక్ష్య సాధనకు తోడ్పడనుంది.

క్రియాశీలకమైన, అంచనావేయతగిన బీమా పథకాలను రూపొందించేందుకు తోడ్పడే ఏఐ ఆధారిత రిస్క్ అసెస్‌మెంట్, శాటిలైట్ ఇమేజింగ్, రియల్ టైమ్ డేటా మోడలింగ్‌ అంశాల్లో క్షేమ జనరల్ ఇన్సూరెన్స్‌నకు అపార సామర్థ్యాలు ఉన్నాయి. వేగం, పారదర్శకతతో, గ్రామీణ ప్రాంత వినియోగదారులకు వ్యక్తిగతీకరించిన పథకాలను అందించేలా క్షేమకు చెందిన టెక్నాలజీ ప్లాట్‌ఫాం, కచ్చితత్వంతో కూడుకున్న అండర్‌రైటింగ్, క్లెయిమ్స్ నిర్వహణకు తోడ్పడుతుంది. కేవీబీ, క్షేమ మధ్య భాగస్వామ్యమనేది వ్యాపార ఒప్పందం మాత్రమే కాదు, భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటి రైతులు, గ్రామీణ ప్రాంతాల ఎంట్రప్రెన్యూర్లకు భద్రత, స్థిరత్వం మరియు ఎదిగేందుకు భరోసాను కల్పించాలన్న ఉమ్మడి లక్ష్య సాకారానికి కూడా తోడ్పడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News