విడుదలైన రోజే పైరసీ జేబులో
కెమెరా పెట్టుకొని సినిమా రికార్డు
వెంటనే వివిధ వెబ్‌సైట్లలో
అప్‌లోడ్ ఒక్కొక్క సినిమాకు
రూ.80వేలు వసూలు ఏడాదిన్నర
నుంచి సాగుతున్న దందా ఇప్పటి
వరకు 40 టాలీవుడ్ సినిమాలను
పైరసీ చేసినట్లు గుర్తించిన పోలీసులు
నిందితుడిని అరెస్టు చేసిన
హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు
మన తెలంగాణ/సిటీబ్యూరో: కొత్త సినిమాలను పైరసీ చేస్తున్న నిందితుడిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…ఎపిలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన జానా కిరణ్ కుమార్ ఎసి టెక్నీషియన్‌గా పనిచేస్తూ నగరంలోని వనస్థలిపురంలో ఉంటున్నాడు. వచ్చే డ బ్బులు సరిపోకపోవడంతో కిరణ్ ఆర్థికంగా ఇ బ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే ట్విటర్‌లో వచ్చిన ఓ మీమ్ చూశాడు. కొత్త సినిమాల ను రికార్డు చేసి పంపిస్తే భారీగా డబ్బులు ఇస్తామని 1తమిళ్‌ఎంవి ఇచ్చిన మెసేజ్ చూసి మెయి ల్ ద్వారా నిందితులను సంప్రదించాడు. తెలుగు కొత్త సినిమాలను థియేటర్‌లో విడుదలైన రోజే రికార్డు చేసి పంపించాలని ఒప్పందం చేసుకున్నాడు. అప్పటి నుంచి నిందితుడు థియేటర్‌లో కొత్త సినిమా రిలీజ్ అయ్యే రోజు ఆన్‌లైన్‌లో టి కెట్ బుకింగ్ చేసుకుని జేబులో ఫోన్ పెట్టుకుని రికార్డు చేసేవాడు. దానికి లింక్‌ను క్రియేట్ చేసి టెలీగ్రాంలో తమిళ్ బ్లాస్టర్స్, 5 మూవీ రూల్జ్, 1 తమిళ్‌ఎంవి వెబ్‌సైట్లకు విక్రయిస్తున్నాడు.
ఇలా ఇప్పటి వరకు నిందితుడు 40 టాలీవుడ్ సినిమాలను రికార్డు చేసి టెలీగ్రాం ద్వారా నిందితులకు పంపించాడు. సినిమాలు పంపించినందుకు క్రి ప్టో కరెన్సీ ద్వారా డబ్బులు తీసుకుంటున్నాడు, ఒక్కో సినిమాకు కిరణ్ రూ.80,000 తీసుకుంటున్నాడు. ఇలా వచ్చిన డబ్బులను వివిధ బ్యాం క్ ఖాతాలకు మళ్లించి డబ్బులను విత్‌డ్రా చేస్తున్నాడు. నిందితుడు ఏడాదిన్నర నుంచి సినిమాలను రికార్డు చేసి వెబ్‌సైట్లకు విక్రయిస్తున్నాడు. జూన్ 5వ తేదీన పైరసీపై తెలుగు ఫిలీం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టిఎఫ్‌సిసి) తరఫున మహీంద్ర బాబు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 2024లో పైరసీ వల్ల టాలీవుడ్ రూ.3,700 కోట్లు నష్ట పోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడిపై ఐటి యాక్ట్ 66(సి), 66(ఈ), 318(4) రెండ్ విత్ 3(5), 338 బిఎన్‌ఎస్ 63,65, కాపీరైట్ యాక్ట్ 6 ఏఏ, 6ఎబి, 7(1ఏ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్ నరేష్, ఎస్సై మన్మోహన్ గౌడ్, హెచ్‌సి ఎండి ఫిరోజ్, రాకేష్ సాగర్, తిరుమలేష్ తదితరులు కేసు దర్యాప్తు చేశారు.