కుతుబ్‌షాహీలు హైదరాబాద్‌ను
నిర్మించారు చంద్రబాబు, వైఎస్
సైబరాబాద్‌కు జీవం పోశారు
నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్
సిటీకి అంకురార్పణ చేస్తున్నది
హైదరాబాద్‌కు దేశంలోని నగరాలతో
కాదు.. అంతర్జాతీయ నగరాల
తోనే పోటీ అభివృద్ధిలో
తెలంగాణ, తమిళనాడు, కేరళ
పోటీపడుతున్నాయి వందేళ్లను
దృష్టిలో పెట్టుకొని రైజింగ్
తెలంగాణ-2047 రూపొందిస్తున్నాం
మలబార్‌గోల్డ్ తయారీ కేంద్రం
ప్రారంభోత్సవంలో సిఎం రేవంత్
మన తెలంగాణ/మహేశ్వరం/ రంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్రం పరిశ్రమలకు కేరాఫ్‌గా నిలుస్తోందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ పరిశ్రమ సరైన సమయంలో సరైన ప్రాంతాన్ని ఎంచుకుందంటూ ఆయన హర్షం వ్యక్తం చేశారు. గురువారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రం పరిధిలోని తుక్కుగూడ సమీపంలో మలబార్ గోల్డ్ అండ్ డై మండ్స్ సంస్థ తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సిఎం రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు కేరాఫ్‌గా మారిందన్నారు. అభివృద్ధిలో తెలంగాణ, కేరళ, తమిళనాడు పోటీపడుతున్నాయ న్నారు. హైదరాబాద్ నగరం వాణిజ్య కేంద్రంగా విరాజిల్లుతోందన్నారు. మహేశ్వరం ప్రాంతం ఫోర్త్ సిటీ వెలుగులు సంతరించుకుంటోందని ఆయన అన్నారు.
30వేల ఎకరాలలో మరో మహానగరం రూపుదిద్దుకుంటోందని ఆయన తెలిపారు. కులీకుతుబ్‌షాహీలు హైదరాబాద్ నిర్మాణం చేపట్టగా నిజాం నవాబులు హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలను వెలుగులోకి తెచ్చారన్నారు. తదనంతరం నాటి సిఎంలు చంద్రబాబు నాయుడు, రాజశేఖర్‌రెడ్డిలు సైబరాబాద్‌కు జీవంపోశారని ఆయన గుర్తుచేశారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్‌సిటీకి అంకురార్పణ చేసిందంటూ ఆయన హర్షం వ్యక్తం చేశారు. భారత ఫ్యూచర్ సిటీని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి అందిస్తుందని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ మహానగరం రూపుదిద్దుకోబోతుందని ఆయన వెల్లడించారు. ప్రపంచదేశాలతో ఈ మహానగరం పోటీపడబోతోందని ఆయన తెలిపారు.
న్యూయార్క్, టోక్యో, జపాన్, సింగపూర్, సౌత్ కొరియా తదితర ప్రాంతాలను సందర్శించిన క్రమంలో హైదరాబాద్ నగరం ప్రపంచంతో పోటీపడగలదనే విషయం గ్రహించినట్లు సిఎం తెలిపారు. అంతటి నైపుణ్యం ఈ ప్రాంత యువతలో ఉందనే విషయం తనతోపాటు మంత్రి శ్రీధర్‌బాబు గుర్తించినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రైజింగ్ 2047లో భాగంగా విజన్ డాక్యుమెంట్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని ముచ్చర్ల, బేగరికంచ ప్రాంతాల్లో ఫ్యూచర్‌సిటీకి బీజం వేసినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే ఐటి, ఫార్మా, బల్క్‌డ్రగ్స్ కంపెనీలకు హైదరాబాద్ నగరం పెట్టింది పేరని ఆయన అన్నారు. ఈ ప్రాంతంలో మలబార్ గోల్డ్ తయారీ యూనిట్‌ను ప్రారంభించడం హర్షనీయమని అన్నారు. మలబార్ సంస్థ యాజమాన్యానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటి శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, టిపిసిసి ప్రెసెడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, టిజిఐఐసి ఛైర్‌పర్సన్ నిర్మలారెడ్డి, మలబార్ గ్రూప్స్ ఛైర్మన్ అహ్మద్, వైస్ ఛైర్మన్ సలీం, ఈడి నిషద్, జిల్లా కలెక్టర్ సి.నారాయణ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కెఎల్‌ఆర్ తదితరులు పాల్గొన్నారు.