- Advertisement -
భారీ స్థాయి మనీలాండరింగ్ కేసులో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు కోర్టు నుంచి చుక్కెదురైంది. రూ 200 కోట్ల లాండరింగ్ కేసు నుంచి తనకువిముక్తి కల్పించాలని నటి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే దీనికి గురువారం హైకోర్టు తిరస్కరించింది. పిటిషన్‌ను కొట్టివేసింది. దీనితో ఈ శ్రీలంక నటికి కాన్మన్ సుఖేష్ చంద్రశేఖర్ సంబంధిత కేసు నుంచి ఊరట దక్కలేదు. ఈ కేసులో ఇడి వర్గాల అనుబంధ చార్జీషిట్‌లో తన పేరు ఉండటాన్ని కూడా నటి సవాలు చేశారు. సంబంధిత కేసు స్థానిక ట్రయల్ కోర్టులో విచారణలో ఉంది.ఈ విషయంలో కూడా కేసు నుంచి విముక్తి కల్పించేందుకు వీలులేదని హైకోర్టు తెలిపింది. ఆమె అభ్యర్థనను కొట్టివేసింది.
- Advertisement -