ఆయన జయంతి వేడుకలను
అధికారికంగా నిర్వహిస్తున్నాం
16సార్లు బడ్జెట్ సమర్పించిన
ఘనత రోశయ్యదే జయంతి
సందేశంలో సిఎం రేవంత్‌రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతి సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి ఆయన్ను స్మరించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రె స్ ప్రభుత్వంలో 16సార్లు ఆర్థిక శాఖ మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత రోశయ్య దక్కించుకున్నారని కొనియాడారు. రోశయ్య జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని తమ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. తమ ప్రభుత్వం అరుదైన గౌరవం ఆయనకు కల్పించిందని సిఎం పేర్కొన్నారు. రోశయ్య సుమారు 50 ఏళ్లు రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నా వివాదరహితుడిగా పేరు పొందారని సిఎం అన్నారు. సమైక్య ఎపికి ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తర్వాత తమిళనాడు గవర్నర్‌గా కూడా ఆయన సేవలందించారని ఆయన తెలిపారు.